తెలంగాణ

రాష్ట్ర వ్యాప్తంగా 86 కోట్ల చేప పిల్లల పెంపకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణ వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలతో జలాశయాల్లోకి భారీగా వరదనీరు వచ్చిచేరుతోంది. దీంతో రాష్ట్ర మొత్తంగా ఉన్న జలాశయాల్లోకి చేప పిల్లలను వదిలే కార్యక్రమానికి జిల్లా మంత్రులు హాజరయ్యారు. తెలంగాణకు అవసరమైన చేపల పెంపకాలు సొంత రాష్ట్రంలో ఉండాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ కోరిక నేరవేరుతోంది. శుక్రవారం జిల్లాలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జిల్లా కలెక్టర్లు కలసి ప్రాజెక్టులు, చెరువుల్లోకి చేపల విడుదల కార్యక్రమంలో పాల్గొన్నారు. వరంగల్ జిల్లా ధర్మసాగర్ మండలం పెద్ద పెండ్యాల పెద్ద చెరువులోకి చేప పిల్లల విడుదల కార్యక్రమంలో పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మత్స్యకారుల నుద్దేశించి మాట్లాడుతూ మత్స్యకారుల జీవన ప్రమాణాలను పెంచడమే లక్ష్యంగా ప్రభుత్వం పని చేస్తోందన్నారు. గత పాలకులు మత్స్యకారులను పట్టించుకోలేదన్నారు. కులవృత్తులను ప్రొత్సహించడానికి ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారులకు చేయూత ఇచ్చారని ఆయన గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 86 కోట్ల చేప పిల్లలను మత్స్యకారుల కోసం ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది మత్స్యకారులు ఉన్నారన్నారు. పెండ్యాల పెద్ద చెరువులో 1,57,000 చేప పిల్లలను వదిలినట్లు మంత్రి చెప్పారు. వన్దన్నపేట మడికొండ పేద్ద చెరువులో చేప పిల్లలను మంత్రి వదిలారు. కరీంనగర్ జిల్లా దిగువ మానేరు జలాశయంలో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు. వనపర్తి జిల్లా శ్రీరంగాపురం మండలం రంగసముద్రం రిజర్వాయర్‌లో చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పాల్గొన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో సారంగపూర్ మండలం స్వర్ణ ప్రాజెక్టులో చేప పిల్లలను విడుదల చేసే కార్యక్రమంలో అటవీ, న్యాయ, దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి పాల్గొన్నారు. మత్స్యకారులను ఆర్థికంగా బలోపేతం చేయడానకి ప్రభుత్వం నిధులు ఎంతైనా ఖర్చు చేయడానకి సిద్ధంగా ఉందన్నారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాని కాళేవ్వరం పుష్కర ఘాట్ వద్ద మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ చేప పిల్లల విడుదల చేసే కార్యక్రమంలో పాల్గొన్నారు. మంత్రి వెంట రాజ్యసభ సభ్యులు బండ ప్రకాశ్, ఎమ్మెల్యే శ్రీ్ధర్ బాబు, జడ్పీ చైర్మెన్ హర్షిణి, పుట్ట మధుకర్ హాజరైయ్యారు. వికారాబాద్ జిల్లా మోమిన్‌పేట్ చెరువులో ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి కోటీ 23 లక్షల చేప పిల్లలను మత్స్యకారులకు అందజేశారు. మహబూబ్‌నగర్ జిల్లా కోయిల్‌సాగర్ రిజర్వాయర్‌లోకి చేప పిల్లలను వదిలే కార్యక్రమంలో జిల్లా మంత్రి శ్రీనివాస్‌గౌడ్ పాల్గొన్నారు. మంత్రి వెంట ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి ఉన్నారు. నిజామాబాద్ జిల్లా శ్రీరాంసాగర్ ప్రాజెక్టులోకి చేప పిల్లను విడుదల చేసే కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లాలో ఉన్న నీటి ప్రాజెక్టుల్లోకి దాదాపురూ. 4 కోట్లతో 5 కోట్ల చేప పిల్లను వదిలినట్లు ఆయన తెలిపారు. దళారీ వ్యవస్థను రూపుమాపడానికే ముఖ్యమంత్రి కేసీఆర్ మత్స్యకారులకు నేరుగా చేప పిల్లలను అందించడం జరుగుతోందన్నారు. సొంతగా చేపలను మార్కెట్ చేసుకోవడానికి మత్స్యకారులకు వాహనాలు కొనుగోలు చేసుకోవడానికి సబ్సిడీతో రుణాలు మంజూరుకు ప్రభుత్వం ముందకు వచ్చిందన్నారు.