తెలంగాణ

ఇంటర్ ఫలితాల గోల్‌మాల్‌పై కేంద్రం సీరియస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాల్లో గందరగోళం కారణంగా 27 మంది విద్యార్థులు ఆత్మహత్యలకు దారితీసిన అంశంపై బీజేపీ సహా పలు రాజకీయ పార్టీలు ఇచ్చిన ఫిర్యాదులపై రాష్టప్రతి భవన్ కేంద్ర హోం శాఖ వివరణ కోరింది. భవ్య అనే విద్యార్థిని పరీక్షల్లో పాసైనా ఆమె ఫెయిలైనట్టు ఫలితాలు ప్రకటించడంతో మొదలైన ఇంటర్ పరీక్ష ఫలితాల గందరగోళం అనేక వివాదాలకు దారితీసింది. బాలల హక్కుల సంఘం సహా పలు సంస్థలు, వ్యక్తులు హైకోర్టులోనూ, సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు సైతం దాఖలుచేశాయి. వాటిపై విస్తృత స్థాయిలో విచారణ జరిగిన తర్వాత హైకోర్టు, సుప్రీంకోర్టు ఆ పిటిషన్లను కొట్టివేశాయి. మరో వైపు విద్యాశాఖ ముగ్గురు సభ్యులతో సాంకేతిక కమిటీని నియమించిది. ఈ కమిటీ ఫలితాల ప్రాసెసింగ్‌కు నియమించిన సంస్థలో లోపాలను, అసౌకర్యాలను ఎత్తిచూపింది. భవిష్యత్‌లో ఇలాంటి లోపాలు లేకుండా చూసుకోవాలని కూడా ఆదేశించింది. రాష్ట్రంలో రాజకీయ పార్టీలు అఖిలపక్షంగా ఏర్పడి ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను ఆదుకోవాలని నిర్ణయించి భిక్షాటనకు సైతం పూనుకున్నాయి. ఇప్పటికే మూడు కుటుంబాలకు చెందిన వారికి లక్ష రూపాయిలు చొప్పున ఆర్ధిక సాయాన్ని అఖిలపక్షాలు అందజేశాయి. రాష్ట్రంలో ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ, రీ వాల్యూయేషన్‌లో లోపాలపై రాజకీయ పార్టీలు రాష్టప్రతికి ఫిర్యాదు చేశాయి. ఈ మొత్తం వ్యవహారంపై సిట్టింగ్ న్యాయమూర్తితో విచారణ జరిపించాలని లేదా సీబీఐకి అప్పగించాలని వారు కోరారు. దీనిపై రాష్టప్రతి భవన్ స్పందిస్తూ జరిగిన ఘటనలపై కేంద్ర హోం శాఖ వివరణ కోరింది. కేంద్ర హోం శాఖ నుండి రాష్ట్రప్రభుత్వానికి తాఖీదులు అందినట్టు సమాచారం. అయితే కోర్టు విచారణలోనే అలాంటిది ఏమీ లేదని తేలిందని రాష్ట్ర ప్రభుత్వం తన వివరణ ఇచ్చినట్టు తెలిసింది. మరో పక్క ఆగస్టు 15 స్వాతంత్య్ర దినోత్సవ సందర్భంగా గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ మాట్లాడుతూ కొంత మంది కావాలని కుట్ర చేశారని, అలాంటి అవకతవకలు ఏమీ జరగలేదని స్పష్టం చేశారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానంతో కేంద్రం సరిపెట్టుకుంటుందా లేక , మరో అడుగు ముందుకు వేసి ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగిస్తుందా అని మీమాంసలో అధికారులున్నారు. సీబీఐకి అప్పగిస్తే అనేక అంశాలు చేరి ఇంటర్ విద్య కుంభకోణాలు అన్నీ వెలుగు చూస్తాయని విద్యార్థి సంఘాల నేతలు పేర్కొంటున్నారు.