తెలంగాణ

20న రాజీవ్ గాంధీ విగ్రహం నుంచి సద్భావన ర్యాలీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: దివంగత మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా ఈ నెల 20వ తేదీన భారీ ఎత్తున కార్యక్రమాలు నిర్వహించేందుకు టీపీసీసీ ప్రణాళికను ఖరారు చేసింది. ఈ మేరకు ఎఐసీసీ కూడా ఆదేశాలు జారీ చేసింది. 20వ తేదీ మంగళవారం సికింద్రాబాద్‌లోని మహాత్మాగాంధీ విగ్రహం, హైదరాబాద్‌లోని అబిడ్స్‌లో నెహ్రూ విగ్రహం, నిజాం కాలేజీ బాబూజగజ్జీవన్ రాం విగ్రహం, ట్యాంక్ బండ్‌పైన అంబేద్కర్ విగ్రహం నుంచి సద్భావన ర్యాలీలు ప్రారంభమవుతాయి. ఈ ప్రదేశాల నుంచి ఉదయం 7.30 గంటలకు రన్ నిర్వహిస్తారు. ఈ ర్యాలీలు బేగంపేట సోమాజిగూడలోని రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద ముగుస్తాయి.
ఈ ర్యాలీలను ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు పీసీసీ మాజీ అధ్యక్షుడు వీ హనుమంతరావు చెప్పారు.