తెలంగాణ

డిగ్రీలో 1.89 లక్షల మందికి ‘దోస్త్’ సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 16: తెలంగాణలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిధిలోని డిగ్రీ కాలేజీల్లో 3,86,864 సీట్లకు గానూ 1,89,500 సీట్లు భర్తీ అయ్యాయి. 87,645 మంది అబ్బాయిలు, 1,01,855 మంది అమ్మాయిలు డిగ్రీ కోర్సులో చేరారు.దాంతో సుమారు రెండు లక్షల సీట్లు భర్తీ కాలేదు. తాజాగా స్పెషల్ డ్రైవ్‌లో సీట్లు పొందిన వారికి మరో రెండు రోజుల పాటు గడువు పొడిగించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. 2018లో 4,03,002 సీట్లు ఉండగా, 2,01,867 సీట్లు భర్తీ అయ్యాయి. 2017లో 4,05,612 సీట్లకు గానూ 2,00,805 సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది కాకతీయ యూనివర్శిటీ బిఏ లాంగ్వేజిలో 60 సీట్లు ఉండగా కేవలం నలుగురు మాత్రమే చేరారు. బీబీఏలో 1140 సీట్లకు 419 మంది మాత్రమే చేరారు. బీబీఎంలో 890 సీట్లు ఉండగా, 398 మంది మాత్రమే చేరారు. బీసీఏలో 510 సీట్లు ఉండగా, 232 మంది చేరారు. బీకాంలో 34,405 సీట్లు ఉండగా అందులో 16,600 మంది చేరారు. అదే బిఎస్సీలో 57,005 సీట్లు ఉండగా 23 వేల మంది మాత్రమే చేరారు. ఉస్మానియాలో బిఏలో 14,603 సీట్లు ఉండగా, 8800 మంది మాత్రమే చేరారు. బిఏ లాంగ్వేజిలో 450 సీట్లకు కేవలం 163 మంది మాత్రమే చేరారు. బీబీఏలో 6820 సీట్లు ఉండగా 3300 మంది, బీసీఏలో 475 సీట్లకు 379 మంది, బీకాంలో 61,968 సీట్లకు 37వేల మంది చేరారు. బిఎస్సీలో 49938 సీట్లకు 26700 మంది చేరారు. సోషల్ వర్కులో 60 సీట్లకు 26 మంది, వోకేషనల్‌లో 100 సీట్లకు 24 మంది చేరారు. మిగిలిన వర్శిటీల్లోనూ ఇదే పరిస్థితి కొనసాగింది.
ఓపెన్ వర్శిటీ పీజీ అడ్మిషన్ గడువు పెంపు
డాక్టర్ బీ ఆర్ అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డిగ్రీ, పీజీ కోర్సులతో పాటు వివిధ సర్ట్ఫికేట్ కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు గడువును ఆగస్టు 31వరకూ పొడిగించారు. విద్యార్ధులు, టీఎస్/ఏపీ ఆన్‌లైన్ లేదా క్రెడిట్, డెబిట్ కార్డుల ద్వారా ట్యూషన్ ఫీజును చెల్లించవచ్చని వర్శిటీ పేర్కొంది. ఫీజు చెల్లింపు తదితర వివరాలను వర్శిటీ వెబ్‌పోర్టల్‌లో పొందుపరిచినట్టు అధికారులు తెలిపారు.
ఐసెట్ ఎంబీఏ, ఎంసీఏ సీట్ల కేటాయింపు
రాష్ట్రంలో ఎంబీఏ, ఎంసీఏ కాలేజీల్లో సీట్లను భర్తీచేసినట్టు అడ్మిషన్ల కన్వీనర్ నవీన్ మిట్టల్ చెప్పారు. ఐసెట్‌లో 41004 మంది అర్హత సాధించారని, అందులో సర్ట్ఫికేట్ల పరిశీలనకు 20334 మంది హాజరయ్యారని, అందులో 19972 మంది తమ వెబ్ ఆప్షన్లను వినియోగించుకున్నారని వారిలో 18776 మందికి సీట్లు కేటాయించామని అన్నారు. ఇంకా రాష్ట్రంలో 5164 సీట్లు మిగిలిపోయాయని, రాష్ట్రంలోని 286 కాలేజీల్లో 23940 సీట్లు అందుబాటులో ఉన్నాయని చెప్పారు. 19 ప్రభుత్వ ఎంబీఏ కాలేజీల్లో 1290 సీట్లు, 258 ప్రైవేటు కాలేజీల్లోని 20737 సీట్లకు 15721 సీట్లు భర్తీ అయ్యాయని అన్నారు. అలాగే 14 ప్రభుత్వం ఎంసీఏ కాలేజీల్లో 670 సీట్లు, 23 ప్రైవేటు కాలేజీల్లో 1243 సీట్లలో 1095 సీట్లు భర్తీ చేశారు. సీట్లు పొందిన వారు 21వ తేదీలోగా ఫీజులు చెల్లించాలని, అనంతరం ఆయా కాలేజీల్లో రిపోర్టు చేయాలని చెప్పారు.