తెలంగాణ

పులిచింతలకుసాగుతున్న వరద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు : నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి పులిచింతల ప్రాజెక్టుకు నాల్గవ రోజు కూడా ఉద్ధృతంగా వరద నీరు వచ్చి చేరుతోంది. గురువారం సాయంత్రం నాటికి 39 టీఎంసీల నీరు నిలువ ఉంది. 175 అడుగులకు గాను 169 అడుగుల మేర నీటిని నిల్వచేశారు. ఇన్‌ఫ్లోగా 5.86 లక్షల క్యూసెక్కుల నీరు వస్తుండగా ఔట్‌ఫ్లోగా 6.41 లక్షల క్యూసెక్కుల నీటిని 22 గేట్లద్వారా దిగువ భాగానికి విడుదల చేస్తున్నారు. ఇదిలా ఉండగా పులిచింతల బ్యాక్ వాటర్ మునుపెన్నడూ లేనివిధంగా భారీగా చేరడంతో ముంపు గ్రామాలైన రేబల్లె, కిష్టాపురం గ్రామాలలో ఉన్న కొద్దిపాటి కుటుంబాలు ఇప్పటికే పునరావాస కేంద్రాలకు తరలివెళ్లారు. వరద ఉద్ధృతి ఎక్కువగా ఉండటం వల్ల ప్రాజెక్టులు పూర్తిస్థాయిలో అనగా 45 టీఎంసీ మేర నీటిని నిల్వ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఇరిగేషన్ అధికారులు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. కృష్ణమ్మ సోయగాలను వీక్షించడానికి గురువారం సెలవుదినం కావడంతో అధిక సంఖ్యలో పర్యాటకులు తరలివచ్చారు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పోలీసులు డ్యాం భద్రతను పర్యవేక్షిస్తూ ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరిస్తున్నారు. మత్స్యకారులు ఎట్టి పరిస్థితుల్లోనూ చేపల వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరించారు. ప్రాజెక్టు ప్రారంభం నాటి నుండి ఇంత భారీ ఎత్తున నీటిని నిల్వచేయడం ఇదే మొదటిసారని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
ముంపు గ్రామాల్లోని లోతట్టు ప్రాంతాల్లోని పత్తి, మిర్చి పంటలకు వరద నీరు వచ్చి చేరింది. ముంపు గ్రామాలకు చెందిన ప్రజలకు ఇప్పటికే కోట్లాది రూపాయలతో శాశ్వత పునారావాస కేంద్రాలు ఏర్పాటుచేయడంతో ముంపు గ్రామాల ప్రజలు అక్కడే జీవనం కొనసాగిస్తున్నారు. ముంపు గ్రామాలలో ప్రజలు ఎవరూ నివసించకపోవడంతో పెద్దగా ప్రమాదం లేదని అధికారులు తెలిపారు.
విద్యుత్ ఉత్పత్తి ప్రారంభం
పులిచింతల ప్రాజెక్టుకు అనుసంధానంగా నిర్మించిన తెలంగాణ జన్‌కో విద్యుత్తు ఉత్పత్తి కేంద్రంలో గురువారం నుండి విద్యుత్ ఉత్పత్తిని జెన్‌కో అధికారులు ప్రారంభించారు. మొత్తం 4 యూనిట్లు ఉండగా రెండవ యూనిట్ మినహా మూడు యూనిట్లలో విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. దీనికిగాను 12 వేల క్యూసెక్కుల నీటిని ఉపయోగిస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఉత్పత్తి అయిన విద్యుత్‌ను సమీపంలోని గ్రిడ్‌కు అనుసంధానం చేస్తున్నామని జెన్‌కో అధికారులు తెలిపారు.