తెలంగాణ

జూరాలకు తగ్గుతున్న వరద ఉద్ధృతి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గద్వాల, ఆగస్టు 15: ప్రియదర్శిని జూరాల ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరద నీటి ఉద్ధృతి గత రెండు రోజులుగా స్వల్పంగా తగ్గుముఖం పడుతోంది. గురువారం సాయంత్రం నాటికి జూరాల జలాశయంలో 316.72 మీటర్లు, 6.279 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోగా ఎగువ ప్రాంతం నుంచి 7.05 లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో ప్రాజెక్టు 53గేట్లను తెరిచి 6,77,689 క్యూసెక్కులను, నెట్టెంపాడు ద్వారా 1500, భీమా లిఫ్ట్-1కు 1300, లిఫ్ట్-2కు 1500, కోయిల్‌సాగర్ 315, సమాంతర కాలువకు 850, కుడి, ఎడమ కాలువలకు 2118 క్యూసెక్కులతో కలిపి మొత్తం 6,83,684 క్యూసెక్కులను విడుదల చేస్తున్నారు. నారాయణపూర్ జలాశయంలో 489.44 మీటర్ల స్థాయిలో నీటిని నిల్వ ఉంచుకొని, ఎగువ ప్రాంతం నుంచి 5.40లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 5,27,300 క్యూసెక్కులను వదులుతున్నారు. అదేవిధంగా ఆల్మట్టి జలాశయంలో 518.37 మీటర్ల స్థాయిలో 103.167 టీఎంసీల నీటిని నిల్వ ఉంచుకోగా ఎగువ ప్రాంతం నుంచి 4,94,260 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతుండగా దిగువకు 5.50లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు.
శ్రీరామ్‌సాగర్‌లోకి నిలిచిపోయిన ఇన్‌ఫ్లో
బాల్కొండ : శ్రీరామ్‌సాగర్ రిజర్వాయర్‌లోకి గత కొద్ది రోజులుగా వచ్చి చేరుతున్న వరదనీరు గురువారం పూర్తిగా నిలిచిపోయిందని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటిమట్టం 1091.00 అడుగులు, 90 టీఎంసీలు కాగా, గురువారం సాయంత్రానికి 1062.90 అడుగులు, 17.18 టీఎంసీల నీరు నిల్వ ఉన్నట్ట్లు వారు చెప్పారు. గత సంవత్సరం ఇదే రోజున రిజర్వాయర్ నీటిమట్టం 1063.00 అడుగులు, 17.32 టీఎంసీల నీరు నిల్వ ఉందని, మిషన్ భగీరథ ద్వారా 380 క్యూసెక్కుల నీటిని తాగునీటి అవసరాల కోసం విడుదల చేస్తున్నామని, జూన్ మొదటి వారం నుంచి నేటి వరకు 12.19 టీఎంసీల వరద నీరు వచ్చి చేరిందని అధికారులు తెలిపారు.