తెలంగాణ

భూదందాలకు చెక్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, ఆగస్టు 15: వరంగల్ నగరంలో భూ దందాలకు తక్షణమే చెక్‌పెట్టాలని రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అధికారులకు ఆదేశాలు ఇచ్చారు. గురువారం సాయంత్రం వరంగల్ సర్క్యూట్ గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన ఎట్ హోంలో అధికారులతో మంత్రి మాట్లాడారు. భూకబ్జాలపై ముఖ్యమంత్రి కేసీఆర్ సీరియస్‌గా ఉన్నారని, ల్యాండ్ మాఫియా అటు ప్రభుత్వ భూములతో పాటు ప్రైవేటు భూములను కూడా కబ్జాలు చేయాడాన్ని ఆయన తీవ్రంగా పరిగణించారు. వ్యక్తులు ఎంతటి వారైనా భూకబ్జాలకు పాల్పడితే సహించేది లేదని హెచ్చరించారు. దొంగ కాగితాలతో భూములను కాజేస్తున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. సామాన్యుల భూములకు భద్రత, భరోసా కల్పించాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. ఇటీవల వరంగల్ నగరంలో జరిగిన రెండు సంఘటనలు అత్యంత హృదయ విదారకమైనవని అన్నారు. తొమ్మిది నెలల పసిపాపపై ఒక మానవ మృగం పాశవికంగా ప్రవర్తిస్తే అతనికి మరణశిక్ష పడిందని, అది మరిచేలోగా మరో మైనర్ బాలికపై కొందరు దుండగులు గ్యాంగ్ రేప్ చేయడం బాధాకర విషయమని అన్నారు. ఈ ఘటనకు పాల్పడిన వ్యక్తులపై కూడా చట్టపరమైన కఠిన శిక్ష పడుతుందని అన్నారు. దేశవ్యాప్తంగా ఈ సంఘటన ప్రచారంలోకి వచ్చిందని మంత్రి అన్నారు. మరోసారి ఇలాంటి సంఘటనలు జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇలాంటి సంఘటనలు జరగినప్పడు ధర్నాలు, రాస్తారోకోలతో సమస్య పరిష్కారం కాదని, ప్రజల్లో చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తప్పు చేస్తే ఎంతటి వారికైనా శిక్ష తప్పదని చైతన్యపర్చాలని ఆయన కోరారు. మరోసారి ఆడ పిల్లల జోలికి వెళ్లాలంటేనే భయపడే విధంగా శిక్షలుపడినప్పడే మహిళలు స్వేచ్ఛగా తిరుగుతారని అన్నారు. ఎట్‌హోం సందర్భంగా గంటసేపు మంత్రి అధికారులతో చిట్‌చాట్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు సంగీతగానాన్ని ఆలపించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వరంగల్ పోలీస్ కమిషనర్ రవీందర్, నగర మేయర్ గుండా ప్రకాష్‌రావు, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే డాక్టర్ టీ రాజయ్య, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, అధికారులు పాల్గొన్నారు.