తెలంగాణ

తెలంగాణ భవన్‌లో పంద్రాగస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు తెలంగాణ భవన్‌లో జరిగాయి. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయం ఆవరణలో జాతీయ పతాకాన్ని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆవిష్కరించారు. పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కార్యాలయానికి తరలివచ్చి ఈ వేడుకల్లో పాలుపంచుకున్నారు. రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్యే దానం నాగేందర్, పార్టీ సీనియర్ నాయకులు గుత్తా సుఖేందర్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్సీ శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే రాఖీ పౌర్ణమి సందర్భంగా పలువురు మహిళా నాయకురాల్లు కేటీఆర్‌కు రాఖీలు కట్టారు.
శాసనసభ ఆవరణలో స్పీకర్
శాసనసభ ఆవరణలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. శాసనసభ కార్యదర్శి వేదాంతం నరసింహాచార్యులు, మాజీ మంత్రి, సిద్ధిపేట ఎమ్మెల్యే తన్నీర్ హరీశ్‌రావు, ఎమ్మెల్సీ కర్నే ప్రభాకర్‌తో పాటు శాసనసభ సచివాలయ ఉద్యోగులు, సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే, శాసనమండలిలో ఆవరణలో జాతీయ పతాకాన్ని మండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ ఆవిష్కరించారు.

చిత్రం...తెలంగాణ భవన్‌లో గురువారం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్