తెలంగాణ

విద్యుత్ సమస్యలపై ‘పవర్ వీక్’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో విద్యుత్ వినియోగదారులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి ‘పవర్‌వీక్’ కార్యక్రమాన్ని తీసుకువస్తున్నామని ఎస్‌పీడీసీఎల్ సీఎండీ రఘమారెడ్డి అన్నారు. గురువారం ఎస్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సమస్యలను పరిష్కరించడానికి 60 రోజుల్లో కార్యాచరణ ప్రణాళికను రూపొందిచాలని ఆయన అధికారులకు సూచించారు. ప్రస్తుతం సంస్థలో రూ. 41 కోట్ల వ్యయంతో స్మార్ట్ గ్రిడ్ పైలెట్ ప్రాజెట్టు, రూ.25 కోట్లతో స్కేడా ప్రాజెక్టు, రూ. 336 కోట్లతో డీడీయుజీజెవై పథకం అమలుకు కృషి జరుగుతోందన్నారు. ఐపీడీఎస్ పథకంలో భాగంగా రూ 472 కోట్ల రూపాయలు సకాలంలో ఖర్చు చేశామన్నారు. ఈ పథకం నిర్దేశిత సమయంలో పూర్తి చేయడంతో కేంద్రం 15 శాతం అదనంగా నిధులు విడుదల చేయడానికి ఆమోదం తెలిపిందన్నారు. కేంద్రం తీసుకువస్తున్న కుసుమ్ పథకం వంటి నూతన పథకాలను అమలు చేయడానికి కార్యాచరణ ప్రణాళికలను రూపొందిస్తున్నామని ఆయన చెప్పారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో విద్యుత్ ప్రాజెక్టుల పురోగతిలో గణనీయమైన అభివృద్ధి జరుగుతోందన్నారు. పవర్‌వీక్ కార్యక్రమంలో ప్రస్తుతమున్న లైన్లలో 3వవైర్, 5వ వైర్‌ను అదనంగా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. గ్రామీణ ప్రాంతల్లో వీధిలైట్ల లోడ్ పరిశీలన, వీధిదీపాలకు ప్రత్యేక ఫేజ్ లైన్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యుత్ లైన్లు వదులుగా ఉంటే సరిచేయడం, విద్యుత్ స్తంభాల ఏర్పాటు, వంగిన పాడైన స్తంభాలు తొలగించడం జరుగుతుందన్నారు.
చిత్రం...టీఎస్‌ఎస్‌పీడీసీఎల్ ప్రధాన కార్యాలయంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న సంస్థ సీఎండీ రఘుమారెడ్డి