తెలంగాణ

సత్వర న్యాయంతోనే నిజమైన స్వాతంత్య్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: సత్వర న్యాయం అందించడం ద్వారానే అసలైన స్వాతంత్య్రం అందినట్టు అవుతుందని హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్ పేర్కొన్నారు. తెలంగాణ హైకోర్టు ప్రాంగణంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్ర సింగ్ చౌహాన్ జాతీయ జండాను ఎగురవేశారు. న్యాయమూర్తులు, బార్ అసోసియేషన్ చైర్మన్ ఎ నర్సింహారెడ్డి, అసిస్టెంట్ సోలిసిటర్ జనరల్ కె లక్ష్మణ్, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సీ ప్రతాప్‌రెడ్డి, వైస్ చైర్మన్ కే సునీల్‌గౌడ్, సభ్యులు పీ విష్ణువర్థన్‌రెడ్డి, ఎమ్మెల్సీ ఎన్ రామచందర్‌రావు, తెలంగాణ హైకోర్టు అడ్వకేట్స్ అసోసియేషన్ అధ్యక్షుడు టీ సూర్య కిరణ్ రెడ్డి, కార్యదర్శులు టీ రజనీకాంత్‌రెడ్డి, సుదర్శన్, సభ్యులు కే లక్ష్మణ్‌కుమార్, ఎన్ హరినాధ్, బీ కొండారెడ్డి, పీ కిరణ్, బీ జయకర్, సీహెచ్ వెంకటయాదవ్, బీ శంకర్, ఎంఎకే ముఖీద్, ఎన్ భుజంగరావు, టీ హనుమంతరెడ్డి, ఫణీంద్రభార్గవ్, ఎ గిరిధర్‌రావుహాజరయ్యారు. హైకోర్టుతో పాటు సికింద్రాబాద్ కోర్టు కాంప్లెక్ల్‌లోనూ, జ్యుడిషియల్ అకాడమి, పురానాహవేలి కోర్టు కాంప్లెక్ల్, నాంపల్లి కోర్టు కాంప్లెక్స్‌ల్లో స్వాతంత్య్రదినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా బార్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ చైర్మన్ ఎ నర్సింహారెడ్డి పతాకావిష్కరణ అనంతరం మాట్లాడుతూ స్వాతంత్య్ర ఉద్యమానికి న్యాయవాదులు సైన్యంలా పనిచేశారని ప్రఖ్యాత రాజ్యాంగ నిపుణుడు ఫాలి ఎస్ నారిమన్ చేసిన వ్యాఖ్యలను గుర్తుచేశారు. స్వాతంత్య్ర స్ఫూర్తిని , స్వేచ్ఛనూ అట్టడుగువర్గాలకు అందించడంలో న్యాయవాదులపై ఎంతో బాధ్యత ఉందని చెప్పారు. అపుడే సమాజం ఆర్ధికంగా, సామాజికంగా, సాంస్కృతికంగా ఎదుగుతుందని పేర్కొన్నారు.
రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ సూచన మేరకు మెట్రోపాలిటన్ లీగల్ సర్వీసెస్ అథారిటీ తరఫున మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి ఎన్ తుకారాంజీ నేతృత్వంలో ఐదు పాఠశాలల్లో పర్యావరణ చైతన్య కార్యక్రమం మొక్కల పంపిణీ చేపట్టారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సివిల్ జడ్జీలు ఎస్ స్వాతిరెడ్డి, హరీషా, కే దేశ్‌పాండే, లక్ష్మీ కుమారి, ఎంకే పద్మావతి పాల్గొన్నారు. వీరితో పాటు న్యాయవాతదులు ఎండీ ఫరీదుద్దీన్, రాణా సుభద్ర, పద్మావతి, పి లతత తదితరులు హాజరయ్యారు.