తెలంగాణ

రాజ్‌భవన్‌లో ఎట్ హోం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా గురువారం సాయంత్రం రాజ్‌భవన్‌లో జరిగిన ఎట్‌హోం కార్యక్రమానికి ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు, టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సీఎల్‌పీ మాజీ నేత కె జానారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా గవర్నర్ ఈఎస్‌ఎల్ నరసింహన్ దంపతులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అభినందనలు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాజ్‌భవన్ కార్యక్రమానికి హాజరైన పలువురు కాంగ్రెస్ నేతలను ఆప్యాయంగా పలుకరించి కరచాలనం చేశారు. సీనియర్ కాంగ్రెస్ నేత కె జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డిని ఆప్యాయంగా పలుకరించారు. ఈ కార్యక్రమానికి టీడీపీ నుంచి రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్ కాంగ్రెస్ నేత మహ్మద్ షబ్బీర్ అలీ, శాసనమండలి మాజీ చైర్మన్ డాక్టర్ చక్రపాణితో పాటు పలువురు సీనియర్ ఐఎఎస్, ఐపీఎస్ అధికారులు, రిటైర్డయిన అధికారులు, స్వాతంత్య్రసమరయోధులు హాజరయ్యారు. అనంతరం గవర్నర్ ఆహుతులకు తేనీటి విందును ఇచ్చారు.