తెలంగాణ

ప్రజా రవాణాలో ఆర్టీసీ కీలకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: దేశాభివృద్ధిలో ప్రజా రవాణా వ్యవస్థ చాలా కీలకమైనదని, ప్రతి రోజూ దాదాపు కోటి మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చుతున్న ‘ఆర్టీసీ’ సంస్థలో భాగస్వాములమైనందుకు గర్వపడాలని సంస్థ ఎండీ సునీల్‌శర్మ కొనియాడారు. గురువారం హైదరాబాద్ బస్సు భవనంలో 73వ స్వాతంత్య్ర దినోత్సవాలలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఆర్టీసీకి దేశంలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. సంస్థకు వచ్చిన గుర్తింపును కొనసాగించడానికి సంస్థలోని ప్రతి వ్యక్తి పని విధానాన్ని మెరుగుపర్చుకుంటే ఫలితాలు ఆశాజనంగా ఉంటాయన్నారు. ఎంతోమంది త్యాగమూర్తుల ద్వారా సాధించుకున్న స్వాతంత్య్ర ఫలాలను భావితరాల వారికి పదిలంగా అందించడమే కాక జాతి ఔన్నత్యాన్ని పెంపొందించడానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్లు పురుషోత్తం, వినోద్‌కుమార్, యాదగిరి, సంస్థ సీపీఆర్‌వో కిరణ్, యూనియన్ ప్రతినిధులు, నాయకులు, సిబ్బంది పాల్గొన్నారు.
చిత్రం...బస్సు భవన్‌లో స్వాతంత్య్ర వేడుకల్లో మాట్లాడుతున్న ఎండీ సునీల్ శర్మ