తెలంగాణ

పైలెట్ శిక్షణకు ఫీజు చెల్లింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: స్వాతంత్య్ర దినోత్సవం రోజున మాజీ సైనికుని కూతురి ఉన్నత విద్యకు టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం రోజున సైనికుని కుటుంబానికి సాయం అందించడం తనకు ఎంతో సంతోషాన్ని కలిగించిందని కేటీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ భవన్‌లో గురువారం జాతీయ పతాక ఆవిష్కరణ తర్వాత మాజీ సైనికుడు వీరభద్రాచారి తన కూతురు మహాలక్ష్మి కలిసి వచ్చి కేటీఆర్‌ను కలిశారు. ఐదు రోజుల కిందట వీరభద్రాచారి ట్విట్టర్ ద్వారా తన కూతురు మహాలక్ష్మికి పైలెట్ కావాలని ఉందని, అయితే తన ఆర్థిక పరిస్థితి ఫీజును భరించలేని స్థితిలో ఉండటంతో మీ సహాయాన్ని ఆర్థిస్తున్నానని కేటీఆర్‌ను కోరారు. ఒక సైనికుడు తన కూతురి ఉన్నత చదువు కోసం ఆర్థించడంతో చలించిన కేటీఆర్, వెంటనే తెలంగాణ ఏవియేషన్ అకాడమీ డైరెక్టర్ భరత్‌తో ఫోన్లో మాట్లాడారు. అకాడమీలో ప్రవేశానికి మార్గం సుగమం చేసి, వీరభద్రాచారిని, ఆయన కూతురు మహాలక్ష్మిని గురువారం తెలంగాణ భవన్‌కు పిలిచి పైలెట్ శిక్షణ ఫీజుకు అవసరమయ్యే ఆర్థిక సహాయాన్ని అందజేశారు. దేశ స్వాతంత్య్ర దినోత్సవం రోజున ఒక మాజీ సైనికుని కుటుంబానికి సహాయం అందించడం కన్నా గొప్పగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకోవడం ఏముంటుందని కేటీఆర్ తన ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
చిత్రం...మాజీ సైనికుడు వీరభద్రాచారి కూతురు మహాలక్ష్మికి పైలెట్ కోర్స్ చేయడానికి
ఆర్థిక సహాయాన్ని అందజేసిన కేటీఆర్