తెలంగాణ

వౌలిక సదుపాయాల అమలులో ఎస్‌సీఆర్ మెరుగైన విజయాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: రైల్వే ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలను అందించడంలో దక్షిణ మధ్య రైల్వే తీసుకుంటున్న చర్యలు సంతృప్తిని ఇస్తున్నాయని ఎస్‌సీఆర్ జీఎం గజానన్ అన్నారు. గురువారం 73వ స్వాతంత్య్ర దినోత్సవాలు సికింద్రాబాద్ రైల్వే స్టోర్ట్స్ కాంప్లెక్స్ మైదానంలో ఘనంగా జరిగాయి. ఈ ఉత్సవాల్లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారతీయ రైల్వే జాతికి చేస్తున్న సేవల్లో దక్షిణ బద్య రైల్వే పాత్రను ఆయన ప్రశంసించారు. 2019 ఏప్రిల్- జూలై మధ్య కాలంలో రూ. 4906 కోట్ల స్థూలాదాయాన్ని ఆర్జించిందన్నారు. గత నాలుగు మాసాల్లో జోన్ పరిధిలో 39 మిలియన్ల టన్నుల సురుకు రవాణా జరిగిందన్నారు. 2018-2019 ఆర్థిక సంవత్సరంలో దక్షిణ మధ్య రైల్వే చేపట్టిన పనుల్లో ముఖ్యమైన ప్రాజెక్టు ఓబులవారిపల్లి- వెంటకటాచలం మధ్య 6.6 కిలోమీటర్ల సొరంగ మార్గం భారతీయ రైల్వేలోనే అతి పొడవైన మార్గమని ఆయన గుర్తు చేశారు. ఈ రైల్వే సొరంగాన్ని పూర్తిగా విద్యుదీకరణ చేయడం సాహసోపేతం అన్నారు. ఈ రైలు మార్గం దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, రాయలసీమ, భారత పశ్చిమ ప్రాంతాల మధ్య సరుకు రవాణాకు అత్యంత సౌకర్యంగా ఉందన్నారు. వౌలాలీలో జరిగిన పరేడ్ కార్యక్రమంలో కూడా స్వాతంత్య్ర దినోత్సవాలల్లో ఘనంగా జరిగాయి, ఈ కార్యక్రమంలో రైల్వే ఐజీ ఐజీ సిన్హా పాల్గొన్నారు. సిబ్బందికి ఉత్తమ పతకాలను ఐజీ సిన్హా అందజేశారు.
చిత్రం...రైల్వే రక్షిణ దళాల పరేడ్‌ను తిలకిస్తున్న రైల్వే ఐజీ సిన్హా