తెలంగాణ

ప్రమాణాలతో జాతీయ హోదా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 15: అత్యుత్తమ ప్రమాణాలను సాధించడం ద్వారా జాతీయస్థాయిలో ఉత్తమ వర్శిటీగా ఎదిగేందుకు కృషి చేస్తున్నట్టు ఇంగ్లీషు ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఇ సురేష్‌కుమార్ పేర్కొన్నారు. రాష్ట్రంలోని పలు విశ్వవిద్యాలయాల్లో 73వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉస్మానియా యూనివర్శిటీ, జాతీయ ఉర్దూ యూనివర్శిటీ, గీతం యూనివర్శిటీ, అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీ, పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్శిటీ, ఉన్నత విద్యా మండలి తదితర సంస్థల్లో ఘనంగా స్వాతంత్య్ర వేడుకలు జరిగాయి. ఉన్నత విద్యా మండలిలో జరిగిన కార్యక్రమంలో చైర్మన్ ప్రొఫెసర్ టీ పాపిరెడ్డి, అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ చైర్మన్ జస్టిస్ పీ స్వరూప్‌రెడ్డి, ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి, ప్రొఫెసర్ వీ వెంకటరమణ, కౌన్సిల్ సభ్యుడు ఓ నర్సింహారెడ్డి తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండలి చైర్మన్ మాట్లాడుతూ గత ఐదేళ్లలో తెలంగాణ ఉన్నత విద్యలో తీసుకున్న అనేక సంస్కరణలను వివరించారు. ఇఫ్లూలో జరిగిన వేడుకల్లో ప్రొఫెసర్ ఇ సురేష్‌కుమార్ మాట్లాడుతూ జాతి కోసం యూనివర్శిటీలు అంకితం కావాలని అన్నారు. యూనివర్శిటీ ఆఫ్ వెచ్చట (జర్మనీ), యూనివర్శిటీ ఆఫ్ మాంట్‌పెల్లిర్ (ఫ్రాన్స్), హంకుక్ యూనివర్శిటీ ఆఫ్ ఫారెన్ స్టడీస్ (సౌత్ కొరియా) తదితర వర్శిటీలతో అంతర్జాతీయ భాగస్వామ్యం ఏర్పాటు చేసుకున్నామని అన్నారు. దక్షిణాది నుండి రెండు సెంట్రల్ యూనివర్శిటీలకు మాత్రమే యూజీసీ గ్రేడెడ్ అటానమీ ఇచ్చిందని, అందులో ఇఫ్లూ ఒకటని అన్నారు. ఈ సందర్భంగా ఆయన యూనివర్శిటీ ఇటీవలి కాలంలో తీసుకున్న అనేక చర్యలను వివరించారు. ఉస్మానియా యూనివర్శిటీ ఇన్‌ఛార్జి వైస్ ఛాన్సలర్ అరవింద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆర్ట్సు కాలేజీ భవన ప్రాంగణంలో ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి, ఒఎస్‌డీ ప్రొఫెసర్ క్రిష్ణారావు, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ రవీందర్, డీన్‌లు, డైరెక్టర్‌లు, ప్రిన్సిపాల్స్, పాలనా సిబ్బంది, బోధనేతర సిబ్బంది, పరిశోధకులు, విద్యార్థులు హాజరయ్యారు. అంబేద్కర్ ఓపెన్ యూనివర్శిటీలో అకడమిక్ డైరెక్టర్ ప్రొఫెసర్ ఎ సుధాకర్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఆయన స్వాతంత్య్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలపారు. ఇన్‌ఛార్జి రిజిస్ట్రార్ డాక్టర్ జీ లక్ష్మారెడ్డి, బోధనేతర సిబ్బంది, బోధన సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గీతం యూనివర్శిటీలో జరిగిన కార్యక్రమంలో అదనపు ఉపకులపతి ప్రొఫెసర్ ఎన్ శివప్రసాద్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. సర్వసత్తాక గణతంత్ర దేశ పౌరుడిగా గాంధీ బోధనలైన శాంతి, అహింసలను అనుసరించాలని ఆయన పిలుపునిచ్చారు. రెసిడెంట్ డైరెక్టర్ డీవీవీఎస్‌ఆర్ వర్మ, డీన్ ప్రొఫెసర్ వై లక్ష్మణ్ కుమార్, ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సీహెచ్ సంజయ్, ప్రొఫెసర్ జీఏ రామారావు, డైరెక్టర్ ప్రొఫెసర్ సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.