తెలంగాణ

తెలంగాణ.. అప్పుల కుప్ప

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్రం అప్పుల ఊబిలో చిక్కుకుందని, ఇష్టం వచ్చినట్లు అప్పులు తెస్తూ రాష్ట్ర ఖజనానా దివాళా తీశారని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి ధ్వజమెత్తారు. బుధవారం ఆయన ఇక్కడ సచివాలయంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావును కలిశారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ అవినీతి రాజ్యమేలుతోందని, సంక్షేమాన్ని అటకెక్కించారన్నారు. రాష్ట్రంలో పరిపాలన నిలిచిపోయిందని, ఎవరేమీ చేస్తున్నారో అర్థం కాని దుస్థితి నెలకొందన్నారు. కాళేశ్వరంలో ఆంధ్ర కాంట్రాక్టర్లకు దోచి పెట్టేందుకు 299,300, 201 జీవోలు ఇచ్చి రూ.42వేల కోట్ల అప్పులు తెచ్చి అవినీతికి పాల్పడుతున్నారన్నారు. నిధులన్నీ కాళేశ్వరానికి మళ్లిస్తున్నారన్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగాలేదని కేంద్రప్రభుత్వం కూడా చెబుతోందన్నారు. కొడుకును ముఖ్యమంత్రిని చేసేందుకు కొత్త సచివాలయాన్ని నిర్మిస్తున్నారన్నారు. పిల్లాయిపల్లి, ధర్మారెడ్డ, బునాదిగాని కాల్వల మరమ్మత్తు పనులు చేస్తున్న కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఇవ్వాలని ఆయన కోరారు. కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించకపోవడంతో పనులను నిలిపివేశారన్నారు. కాల్వల నుంచి నీరు వెళేళ్ల మార్గం లేదన్నారు. పంటలు ఎండిపోతున్నాయన్నారు. పశువులకు కూడా నీరు లేదన్నారు. భూసేకరణకు సంబంధించిన రూ.50 కోట్లు, కాంట్రాక్టర్లకు రూ.45 కోట్ల బకాయిలు వెంటనే విడుదల చేయాలన్నారు. పాడి రైతులకు ఇచ్చే నాలుగు రూపాయల ప్రోత్సాహకానికి సంబంధించి కూడా వంద కోట్ల బకాయిలు ఉన్నాయన్నారు. ఒక మదర్ డెయిరీ రైతులకే రూ.25 కోట్లు ఇవ్లాన్నారవు. పాడి రైతులకు ఇవ్వాల్సిన బకాయిలు వెంటనే విడుదల చేయకపోతే సచివాలయాన్ని ముట్టడిస్తామన్నారు. ఆర్టీసి ఉద్యోగులకు పదో తేదీన జీతాలు ఇచ్చారన్నారు. ఉద్యోగులకు ఐర్‌ను కూడా ఇవ్వలేదన్నారు. ఆరోగ్యశ్రీ డబ్బులు ఇవ్వక పేదలు ఇబ్బంది పడుతున్నారన్నారు.