తెలంగాణ

రోగాల రాష్ట్రంగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు జ్వరాల బారినపడి, విపరీతమైన బాధలుపడుతున్నారని, ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య సదుపాయాలు శిథిలావస్థకు చేరుకున్నాయని సీఎల్‌పీ నేత భట్టివిక్రమార్క విమర్శించారు. ఈ నెల 19వ తేదీ నుంచి రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లో ఉన్న ప్రభుత్వాసుపత్రుల్లో వైద్య పరిస్థితులను కాంగ్రెస్ పార్టీ సమీక్షిస్తుందని, ఆసుపత్రులను తమ పార్టీ ప్రతినిధుల బృందం సందర్శిస్తుందన్నారు. బుధవారం ఇక్కడ విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, విద్య, ఆరోగ్యం మాఫియా చేతుల్లోకి వెళ్లాయన్నారు. రాష్ట్రప్రభుత్వం తక్షణమే హెల్త్ ఎమర్జన్సీని ప్రకటించాలన్నారు. ప్రజల అనారోగ్య సమస్యలపై ప్రభుత్వం దృష్టిపెట్టడం లేదన్నారు. సచివాలయాన్ని కూల్చడంపైన మాత్రమే ముఖ్యమంత్రి కేసీఆర్ నిమగ్నమయ్యారన్నారు. తెలంగాణ రోగాల రాష్ట్రంగా మారిందన్నారు.కాంగ్రెస్ పార్టీ భావజాలం ఉన్న వారెవరూ పార్టీని వీడలేదన్నారు. కొంత మంది వారి వ్యక్తిగత ప్రయోజనం కోసం పార్టీని మారుతున్నారని చెప్పారు. పార్టీని వీడేవారితో మాట్లాడి పార్టీ మారకుండా చూస్తున్నామన్నారు. మాజీ ఎంపీ వీహెచ్ చేసిన విమర్శలపై స్పందిస్తూ టిక్కెట్ల కేటాయింపు అంశం ఎన్నికల కమిటీ చూసుకుంటుందన్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి కుంతియా స్పష్టత ఇచ్చారన్నారు. ఎఐసీసీ నేత కొప్పుల రాజును విమర్శించడం సరికాదన్నారు. గాంధీభవన్‌కు తాళం వేసుకునే రోజు త్వరలోనే వస్తుందని టీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఒకటేనంటూ బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. వాస్తవం చెప్పాలంటే బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీలు ఒకటేనని, ఆ రెండు పార్టీలు రహస్యమిత్రులన్నారు. జీఎస్‌టీ చట్టం, పెద్ద నోట్ల రద్దు వంటి బిల్లుల విషయంలో పార్లమెంటులో టీర్‌ఎస్ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తోందన్నారు. ఈ రెండు పార్టీలు ఒకే తానులో రెండు ముక్కలాంటివన్నారు. బీజేపీ, కాంగ్రెస్‌ను టీఆర్‌ఎస్ పార్టీతో పోల్చుతూ విమర్శించడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు.