తెలంగాణ

మరో 16911 మందికి డిగ్రీ సీట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: తెలంగాణలో దోస్త్ ద్వారా మరో 16911 మందికి డిగ్రీ సీట్లు కేటాయించినట్టు కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి తెలిపారు. స్పెషల్ డ్రైవ్ లో 17490 మంది రిజిస్టర్ చేసుకున్నారని, అందులో 16076 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని అన్నారు. గతంలో కన్ఫర్మ్ చేసుకున్న వారు 1414 మంది వెబ్ ఆప్షన్లు ఇచ్చారని, వీరందిరలో 16911 మందికి డిగ్రీ కాలేజీల్లో సీట్లు కేటాయించామని అన్నారు. కొత్తగా 15497 మందికి సీట్లు రాగా, బెటర్‌మెంట్‌లో మంచి కాలేజీలకు 1414 మంది మారారని, 579 మందికి సీట్లు లభించలేదని తెలిపారు. సీట్లు పొందిన వారు 16వ తేదీలోగా ఆన్‌లైన్‌లో సీట్లను కన్ఫర్మ్ చేసుకుని అలాట్‌మెంట్ ఆర్డర్ పొందాలని, అనంతరం ఆయా కాలేజీల్లో రిపోర్డు చేయాలని చెప్పారు. 16వ తేదీ నుండి స్పాట్ అడ్మిషన్లకు అవకాశం ఇస్తామని వెల్లడించారు. స్పాట్ అడ్మిషన్ కోసం అభ్యర్ధులు 400 రూపాయిలు రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించాలని పేర్కొన్నారు. దోస్త్‌లోని కాలేజీ వెబ్‌సైట్‌ల ద్వారా ఈ సీట్ల భర్తీ జరుగుతుందని చెప్పారు.