తెలంగాణ

కేటీఆర్ చొరవతో వైకల్యాన్ని జయించిన బాలుడు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మానవత్వంతో చూపిన చొరవకు సాయిరామ్ అనే నాలుగవ తరగతి చదివే బాలుడు అంగవైకల్యాన్ని జయించాడు. గోదావరిఖని చెందిన సాయిరామ్ అనే బాలుడికి చిన్నప్పుడై పోలియో వల్ల కాళ్లు వంకరపోయి నడవలేని పరిస్థితిని ఎదుర్కొన్నారు. సాయిరామ్ తన తల్లిదండ్రులు రాజమల్లు, లక్ష్మితో కలిసి గత జనవరిలో కేటీఆర్‌ను కలిసి శస్త్ర చికిత్స కోసం సహాయం చేయాల్సిందిగా ఆర్థించారు. ఆ బాలుడికి శస్త్ర చికిత్సకు అవసరమైన సహాయం అందించాల్సిందిగా హైదరాబాద్‌కు చెందిన టీఆర్‌ఎస్ నాయకుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్‌ను కేటీఆర్ ఆదేశించారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి కూడా ఆర్థిక సహాయాన్ని కేటీఆర్ అందించారు. సాయిరామ్‌ను హైదరాబాద్‌లోని ఒక ప్రముఖ ఆస్పత్రిలో చేర్పించి వంకరపోయిన కాళ్లకు చికిత్స చేయించారు. దీంతో ప్రస్తుతం సాయిరామ్ అందరి మాదిరిగా నడవగలుగుతున్నారు. సాయిరామ్‌ను బుధవారం కట్టెల శ్రీనివాస్ యాదవ్ తన వెంటబెట్టుకుని కేటీఆర్‌ను కలిశారు. సాయిరామ్ కాళ్లు సాధారణ స్థితికి రావడంతో కేటీఆర్ ఆనందం వ్యక్తం చేశారు. తన కుమారుడికి శస్త్ర చికిత్స చేయించి ఆదుకున్న కేటీఆర్‌కు అతని తల్లిదండ్రి ధన్యవాదాలు తెలిపారు. సాయిరామ్‌కు భవిష్యత్‌లో మరే సహాయం కావాల్సినా గోదావరిఖని ఎమ్మెల్యే కోరుకంటి చందర్ అండగా ఉంటారని కేటీఆర్ హామీ ఇచ్చారు.

చిత్రాలు.. శస్త్ర చికిత్సకు ముందు.. తర్వాత సాయిరామ్