తెలంగాణ

తిమ్మాపూర్ మానసిక వికలాంగుల కేంద్రానికి నిధులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 14: కరీంనగర్ జిల్లా స్వాతంత్య్ర సమరయోధుల ట్రస్టు ఆధ్వర్యంలో తిమ్మాపూర్‌లో నిర్వహిస్తున్న మానసిక వికలాంగుల కేంద్రానికి సరిపడా నిధులను మంజూరు చేయాలని ట్రస్టు చైర్మన్, సీపీఐ కార్యదర్శి చాడ వెంకటరెడ్డి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెతడ్డిని కోరారు . ఈ మేరకు ఆయన ఒక విజ్ఞాపన పత్రాన్ని అందజేశారు. 1989లో ప్రారంభించిన ఈ పాఠశాల-శిక్షణ కేంద్రంలో 90 మంది విద్యార్థులు, 43 మంది సిబ్బందితో రెండు ఎకరాల విస్తీర్ణంలో పనిచేస్తోందని అన్నారు. సంస్థలో 17 తరగతి గదులు ఉన్నాయని, సిబ్బందికి సైతం నివాస గృహాలను నిర్మించడం జరిగిందని చెప్పారు. సామాజిక న్యాయశాఖ, వికలాంగుల శాఖల ద్వారా రావల్సిన నిధులు రావడం లేదని, దాంతో సంస్థ నిర్వహణ ఆర్ధిక భారంగా మారిందని చాడ వెంకటరెడ్డి పేర్కొన్నారు. 2017-18లో 17.34 లక్షల రూపాయిలు మాత్రమే సంస్థకు అందాయని, ఈ ఏడాది 8.67 లక్షలు విడుదల చేయగా, ఇంకా 8.67 లక్షల రూపాయిలు విడుదల కావల్సి ఉందని పేర్కొన్నారు.
వ్యవసాయ కార్మిక సంఘం వర్కుషాప్
ఆగస్టు 17,18 తేదీల్లో హైదరాబాద్‌లో వ్యవసాయ కార్మిక సంఘం రాష్టస్థ్రాయి వర్కుషాప్‌ను నిర్వహించనున్నట్టు తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం అద్యక్షుడు కలకొండ కాంతయ్య, ప్రధానకార్యదర్శి టీ వెంకట్రాములు తెలిపారు.
సర్పంచ్ వేధింపులకు కార్మికురాలి బలి
నిజామాబాద్ జిల్లా రేంజల్ మండలం వీరన్నగుట్ట పంచాయతీలో పారిశుద్ధ్యం నిర్వహిస్తున్న కార్మికులను అధికార పార్టీ సర్పంచ్ వేధింపులకు పాల్పడుతూ ఐదుగురిని తొలగించారని, దీంతో మనోవేదనకు గురైన కార్మికురాలు మృతి చెందారని తెలంగాణ గ్రామ పంచాయతీ ఎంప్లాయిస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు పాలడుగు భాస్కర్, చాగంటి వెంకటయ్య, అధ్యక్షుడు పి గణపతిరెడ్డి, ప్రధానకార్యదర్శి ఐ శ్రీపతిరావులు ఆరోపించారు. చట్టవిరుద్ధంగా కార్మికులను తొలగించరాదంటూ యూనియన్ ఆందోళనకు పూనుకుంటున్నట్టు వారు చెప్పారు.