తెలంగాణ

మణిశంకర్ అయ్యర్ వ్యాఖ్యలపై బీజేపీ మండిపాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: ఆంధ్రప్రదేశ్ విభజన కాంగ్రెస్ నాయకత్వం చేసిన చారిత్రాత్మక తప్పిదమని కాంగ్రెస్ సీనియర్ నేత మణి శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలను బీజేపీ తెలంగాణ ముఖ్య అధికార ప్రతినిధి కృష్ణసాగర్ రావు ఖండించారు. మణి శంకర్ అయ్యర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు స్పందించాలన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి తమ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడి వ్యాఖ్యలను సమర్థిస్తున్నారా లేక ఖండిస్తున్నారా అని ఆయన ప్రశ్నించరు. ఇంతవరకు తెలంగాణ నుంచి ఏ కాంగ్రెస్ నేతలు కూడా మణి శంకర్ అయ్యర్ మాటలను తప్పుబట్టలేదన్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ ద్వంద్వ వైఖరి, అవకాశవైఖరికి నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాలు ఆశించి పునర్విభజన బిల్లును పార్లమెంటు ఉభయ సభల్లో ప్రవేశపెట్టిందన్నారు. వాస్తవానికి ఆ పార్టీకి తెలంగాణ ఏర్పాటు పట్ల చిత్తశుద్ధి లేదన్నారు. ఉభయ సభల్లో సరిపోయినంత బలం లేని కాంగ్రెస్ పునర్విభజన బిల్లు ప్రవేశపెట్టినప్పుడు అది ఆమోదం పొందుతుందని భావించలేదన్నారు. రెండు రాష్ట్రాల్లో రాజకీయ ప్రయోజనాల్లో నెరవేర్చుకోవాలని మాత్రమే చూసిందన్నారు. అయినప్పటికీ బీజేపీ భేషరతుగా రెండు సభల్లో బిల్లుకు మద్దతు ఇచ్చిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని చాటుకున్నారన్నారు. దీని వల్ల వేలాది మంది యువకుల బలిదానాలు ఫలించి తెలంగాణ రాష్ట్ర స్వప్నం సాకారమైందన్నారు. తామే తెలంగాణ ఇచ్చామని చెప్పుకునే నైతిక హక్కు కాంగ్రెస్‌కు మాత్రం లేదన్నారు.