తెలంగాణ

ఏకీకృత రూల్స్ పేరుతో కాలయాపన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: ఏకీకృత సర్వీసు రూల్స్ పేరుతో కాలయాపన చేయకుండా వెంటనే టీచర్ల పదోన్నతులు చేపట్టాలని తెలంగాణ టీచర్సు ఫెడరేషన్ అధ్యక్షుడు ఈ రఘునందన్, ప్రధానకార్యదర్శి కే రమణ పేర్కొన్నారు.10వ పీఆర్సీ సిఫార్సుల ప్రకారం 70 సంవత్సరాలు నిండిన పెన్షనర్లకు అదనపు క్వాంటమ్ ఆఫ్ పెన్షన్ 15 శాతం మంజూరు చేయాలని, అన్ని వసతులూ ఉన్న ప్రభుత్వ ఉన్నత పాఠశాలలు అన్నింటినీ రెసిడెన్షియల్ స్కూళ్లుగా మార్చాలని వారు కోరారు. 2016 వేసవిలో మధ్యాహ్న భోజన కార్యక్రమానికి పనిచేసిన టీచర్లకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని, ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇచ్చిన హామీలు ప్రధానంగా లాంగ్వేజి పండిట్లు,పీఈటీల అప్‌గ్రేడేషన్ పదోన్నతులను సాకారం చేయాలని వారు కోరారు. టీఆర్‌ఎస్ ఎన్నికల మ్యానిఫెస్టో ప్రకారం పదవీ విరమణ వయస్సును 61 ఏళ్లకు పెంచాలని, అనేక సందర్భాల్లో సీఎం ఇచ్చిన హామీ మేరకు ఐఆర్‌ను 43 శాతం ప్రకటించాలని అన్నారు.