తెలంగాణ

అట్రాసిటీ కేసుల్లో స్టేషన్ బెయల్ ఇవ్వదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 13: అట్రాసిటీ కేసుల విషయంలో స్టేషన్ బెయిల్ ఇవ్వకూడదని, ఒకవేళ ఇచ్చినట్లు తమ దృష్టికి వస్తే అలాంటి వారిపై చర్యలు తప్పవని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె.రాములు హెచ్చరించారు. రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా సమాజంలో ఉండే ఎస్సీలకు ఇతరులతో పాటుగా సమన్యాయం కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. మంగళవారం హైదరాబాద్‌లో వివిధ శాఖల అధికారులతో ఎస్సీలకు సంబంధించిన పలు అంశాలపై జాతీయ ఎస్సీ కమిషన్ అధికారులతో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎస్సీ అట్రాసిటి కేసులకు సంబంధించిన బాధితులకు పరిహారం అందించడంలో జాప్యం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అట్రాసిటీ కేసుల విషయంలో అన్ని శాఖల అధికారులు మానవతా దృక్పథంతో మెలగాలన్నారు. ఈ కేసులకు సంబంధించి పూర్వాపరాలు పరిశీలించి అధికారులు బాధితులకు సకాలంలో న్యాయం జరిగేలా చూడాలని సూచించారు. ఎస్సీలకు సమన్యాయం కల్పించే విషయంలవో రెవెన్యూ, పోలీసు శాఖలు ప్రధాన భూమిక పోషిస్తాయన్నారు. ఉద్యోగాలు, పదోన్నతుల విషయంలో ఎస్సీలకు సముచిత స్థానం కల్పించేలా అన్ని శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని రాములు ఆదేశించారు. ఎస్సీలకు సంబంధించిన భూములు కబ్జాకు గురైనట్లయితే వాటిని వెంటనే స్వాధీనం చేసుకుని అర్హులైన వారికి కేటాయించాలని తెలిపారు. ఎస్సీలకు డబుల్ బెడ్‌రూం ఇళ్ల కేటాయింపుల్లో ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు. హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో కలెక్టర్ కన్నన్ మాణిక్ రాజ్, హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ తదితరులు పాల్గొన్నారు.
చిత్రం...ఎస్సీ కులాలపై సమీక్షలో మాట్లాడుతున్న రాములు