తెలంగాణ

పులిచింతలకు చేరుతున్న వరద నీరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మేళ్లచెర్వు, ఆగస్టు 12: నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుండి గేట్ల ద్వారా నీరు దిగువ భాగానికి భారీగా నీటిని విడుదల చేయడంతో సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండల పరిధిలోని పులిచింతల ప్రాజెక్టుకు సోమవారం సాయంత్రానికి దాదాపు 4 టీఎంసీల వరద నీరు వచ్చి చేరింది. రాత్రి వరకు అత్యధికంగా నీరు వచ్చే అవకాశం ఉందని, పులిచింతల అధికారులు తెలిపారు. ఇదిలా ఉండగా పులిచింతల ప్రాజెక్టు ముంపు గ్రామాలైన చింత్రియాల, కిష్టపురం, తమ్మవరం, రేబల్లే, అడ్లూరు, పిక్లానాయక్‌తండా, వెల్లటూరు, నెమలిపురి గ్రామాలకు అన్ని రకాల వౌలిక సదుపాయాలతో పునరావాస కేంద్రాలు ఇప్పటికే నిర్మించారు. ముంపు గ్రామాల ప్రజలు తమకు ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లోనే జీవనం సాగిస్తున్నారు. రేబ ల్లే, వెల్లటూరు, కిష్టపురం పాత గ్రా మాల్లో వ్యవసాయం, పశుపోషణ, చేపల పట్టే జాలర్లు కొద్దిసంఖ్యలో నివసిస్తున్నారు. ముంపు గ్రామాల్లో ఉన్న ప్రజలు తక్షణమే గ్రామాలు ఖాళీ చేసి పునరావాస కేంద్రాలకు వెళ్లేలా చూడాలని ఎస్పీ వెంకటేశ్వ ర్లు ఆదేశించడంతో కోదాడ డీఎస్పీ సుదర్శన్‌రెడ్డి, కోదాడ రూరల్ సీఐ కొలను శివరాంరెడ్డి, చింతలపాలెం తహశీల్దార్ కమలాకర్‌ల ఆధ్వర్యంలో అధికారుల బృందం గ్రామాలకు వెళ్లి ఖాళీచేయాలని కోరారు. పులిచింతల ప్రాజెక్టు పూర్తిస్ధాయి నీటిసామర్ధ్యం 45 టీఎంసీలు ఉండగా ప్రాజెక్టు ప్రారంభం నాటి నుండి ఇంత వరకు పూర్తిస్ధాయిలో ప్రాజెక్టు నిండలేదు. ఈసారి సాగర్ నుండి 24 గేట్లు ఎత్తి దిగువకు భారీగా నీటిని విడుదల చేస్తున్నందున పూర్తిస్థాయిలో నీటిని నిల్వచేసే యోచనలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నట్టు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టుకు అనుసంధానంగా ఉన్న తెలంగాణకు చెందిన 120 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి కేంద్రం కూడ పూర్తిస్థాయిలో విద్యుత్ ఉత్పత్తి చేసేలా అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే నాలుగు విద్యుత్ యూనిట్లు ట్రయల్న్ చేసుకొని ప్రాజెక్టు నీటి ప్రవాహాం కోసం ఎదురుచూస్తున్నారు. జాలర్ల్లు చేపల వేటకు వెళ్లవద్దని, సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లాలని అధికారులు ప్రజలకు సూచించారు. ప్రస్తుతం ప్రాజెక్టుకు లక్షా 7 వేల 489 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా 13,208 క్యూసెక్కుల నీటిని పులిచింతల ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రకాశం బ్యారేజ్‌కు నీటిని విడుదల చేస్తున్నారు.

చిత్రం...భారీగా చేరిన వరద నీటితో పులిచింతల ప్రాజెక్టు