తెలంగాణ

ముస్లింల సంక్షేమానికి ప్రాధాన్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, ఆగస్టు 12: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆర్థికంగా, సామాజికంగా వెనుకబాటుకు గురైన ముస్లీం మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తూ వివిధ పథకాలను అమలుచేస్తోందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. ముస్లింల పర్వదినమైన బక్రీద్ సందర్భంగా సోమవారం జిల్లాకేంద్రంలోని ఈద్గాలో జరిగిన ప్రార్ధనల్లో పాల్గొని ముస్లింలకు పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముస్లిం మైనార్టీల్లో అత్యధికంగా పేదరికంలో మగ్గుతున్న విషయాన్ని గుర్తించిన సీఎం కేసీఆర్ వారికి చేయూతనిచ్చేలా అనేక పథకాలను ప్రారంభించారన్నారు. విద్యతోనే ముస్లిం కుటుంబాల స్థితిగతుల్లో మార్పులు తేవాలన్న లక్ష్యంతో రాష్టవ్య్రాప్తంగా మైనార్టీ గురుకులాలను ఏర్పాటుచేసినట్టు చెప్పారు. అంతేకాకుండా నిరుపేద ముస్లిం యువతుల వివాహం కోసం షాదీ ముబారక్ పథకాన్ని అమలుచేస్తున్నట్టు చెప్పారు. రంజాన్ పర్వదినం సందర్భంగా పేదముస్లింలందరికీ నూతన దుస్తులు అందిండంతో పాటు రాష్టవ్య్రాప్తంగా ముస్లింలకు ఇఫ్తార్ విందులు ఇస్తున్నామన్నారు. జిల్లాకేంద్రంలో చారిత్రాత్మక పెద్ద మసీదు ఆధునీకరణకు రూ.50 లక్షల నిధులు మంజూరుచేసి టెండర్ల ప్రక్రియను పూర్తిచేసినందున త్వరలోనే పనులు ప్రారంభంకానున్నట్టు తెలిపారు. జిల్లాకేంద్రంలో రూ.2 కోట్లతో షాదీఖానా నిర్మాణం చేపట్టనున్నట్టు ప్రకటించారు. ఆయన వెంట రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్‌తో పాటు పలువురు టీఆర్‌ఎస్ నాయకులు, ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు.