తెలంగాణ

విద్యా వ్యతిరేక విధానాలపై రాష్టవ్య్రాప్త పోరాటం: ఏఐఎస్‌ఎఫ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 12: పాలకులు అవలంబిస్తున్న విద్యా వ్యతిరేక విధానాలపై పోరాటాలు చేస్తామని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ అశోక్ స్టాలిన్ పేర్కొన్నారు. అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్‌ఎఫ్) ఆవిర్భావ సందర్భంగా సోమవారం నాడిక్కడ జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం జరిగిన పోరాటంలో ఎంతో మంది యువకిశోరాలు బలిదానం చేశారని 83 ఏళ్లుగా దేశ సమగ్రత, విద్యారంగ సమస్యలపై సమరశీల ఉద్యమాలు నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ సందర్భంగా స్టాలిన్ అరుణ పతాకాన్ని ఎగురవేశారు. మాజీ నేతలు యు ఎల్లేష్ కేక్ కట్ చేళశారు. ఎఐఎస్‌ఎఫ్ 1936 ఆగస్ట 12న ఆవిర్భవించిందని, దేశ స్వాతంత్య్రోద్యమంలో అసమాన పోరాటాలు చేసిందని చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలోనూ, మలిదశ తెలంగాణ ఉద్యమంలోనూ కీలక పాత్ర పోషించిందని చెప్పారు. ఎంతో మంది రాజకీయ నాయకులను, మేధావులను ఎఐఎస్‌ఎఫ్ అందించిందని మల్లేష్ పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్‌ఎన్ శంకర్, ఉపాధ్యక్షుడు పుట్ట లక్ష్మణ్ పాల్గొన్నారు.