తెలంగాణ

కేటీఆర్‌కు వరల్డ్ వాటర్ కాంగ్రెస్ ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 26: తెలంగాణ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావుకు అమెరికాలో జరుగనున్న వరల్డ్ వాటర్ కాంగ్రెస్ సదస్సుకు ఆహ్వానం అందింది. ప్రపంచంలోనే అతిపెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రసంగించాల్సిందిగా నిర్వహకులు కోరారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ సంస్థ వచ్చే ఏడాది వరల్డ్ వాటర్ కాంగ్రెస్ సదస్సుకు నిర్వహించనుంది. దీనికి ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాలకు చెందిన వెయ్యి మందికి పైగా సాగునీటి నిపుణులు, పర్యావరణవేత్తలు హాజరు కానున్నారు. ఇదే సదస్సు 2017లో కాలిఫోర్నియాలో నిర్వహించగా దానికి హాజరైన కేటీఆర్, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులు, పర్యావరణ సమతుల్యత, నీటి వనరుల అభివృద్ధి కోసం తీసుకుంటున్న చర్యలను వివరించారు. ఈ క్రమంలో ప్రపంచంలోనే అతి పెద్ద ఎత్తిపోతల ప్రాజెక్టు కాళేశ్వరం పూర్తి చేసినట్టు తమకు సమాచారం ఉందని, దానిపై సదస్సులో వివరించాల్సిందిగా నిర్వహకులు కేటీఆర్‌కు పంపించిన ఆహ్వాన పత్రంలో కోరారు.