తెలంగాణ

తెలంగాణ విద్యార్థులకు నేషనల్ మెరిట్ స్కాలర్‌షిప్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: తెలంగాణ విద్యార్థులకు జాతీయ మెరిట్ స్కాలర్‌షిప్ మంజూరుకు పోర్టల్‌ను ప్రారంభించినట్టు పరీక్షల విభాగం సంచాలకుడు బీ సుధాకర్ తెలిపారు. ఎన్‌ఎంఎంఎస్ పరీక్ష నిబంధనలకు లోబడి అర్హత సాధించిన వారు, కొత్తగా స్కాలర్‌షిప్ కోరుకునే వారు సైతం స్కాలర్‌షిప్స్ డాట్ జీవోవీ డాట్ ఇన్ అనే పోర్టల్‌లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని చెప్పారు. ఇందుకు అక్టోబర్ 15 వరకూ గడువు ఉంటుందని అన్నారు. నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో నమోదు చేసుకునే ప్రతివిద్యార్థి వివరాలూ సంబంధిత ప్రధానోపాధ్యాయులు, జిల్లా విద్యాశాఖాధికారులు తప్పనిసరి పరిశీలించి స్కాలర్‌షిప్స్ డాట్ జీవోవీ డాట్ ఇన్‌లో నిర్ధారించాలని ఆయన పేర్కొన్నారు. 2015, 2016, 2017 సంవత్సరాల్లో అర్హత పొంది 2019-20కు అర్హత కొనసాగించిన వారు కూడా దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.
ఢిల్లీ అకాడమీ స్కాలర్‌షిప్‌లు
ప్రముఖ ఢిల్లీ అకాడమి ఆఫ్ మెడికల్ సైనె్సస్ సంస్థ తాజాగా పీజీ మెడికల్ ప్రిపరేషన్ కోర్సుల్లో చేరేవారికి స్కాలర్‌షిప్‌లను అందించనున్నట్టు ప్రకటించింది. విద్యార్థులకు ఆర్థిక చేయూత అందించేందుకు సహకరించనున్నట్టు సంస్థ డైరెక్టర్ డాక్టర్ సుమేర్ సేథీ తెలిపారు. తాము అందించే స్కాలర్‌షిప్‌ల ద్వారా మెడికల్ విద్యార్థులు ఉన్నత విద్యాభ్యాసం చేయవచ్చని, వారి ప్రతిభకు ఇది ప్రోత్సాహం లాంటిదని అన్నారు.
ప్రొఫెసర్లపై వేధింపులు ఆపాలి: ఆవాజ్
ఢిల్లీ జేఎన్‌యూలో మహిళా ప్రొఫెసర్ రోసినా నసీర్‌పై వర్శిటీ ఉన్నతాధికారులు వేధింపులు ఆపాలని ఆవాజ్ తెలంగాణ రాష్ట్ర క4మిటీ అధ్యక్షుడు ప్రొఫెసర్ మహ్మద్ అన్సారీ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.