తెలంగాణ

ఒక్క చింతమడకే బాగుపడితే ఎలా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 23: ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అన్ని గ్రామాల అభివృద్ధి పట్ల సమృదృష్టితో వ్యవహరించాలని, పక్షపాత వైఖరిని విడనాడాలని పీసీసీ సీనియర్ నేత మల్లు రవి అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ తన సొంత గ్రామం చింతమడకకు మాత్రమే ఇబ్బడి ముబ్బడిగా నిధులు కేటాయించడం సరికాదన్నారు. కేసీఆర్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అనే విషయాన్ని గుర్తు పెట్టుకోవాలన్నారు. తన సొంత గ్రామానికే సింహ భాగం నిధులు ఇస్తే, ఇతర గ్రామాల సంగతి ఏమిటని ప్రశ్నించారు. ఒక్క గ్రామానికి రూ.200 కోట్లు కేటాయించారన్నారు. తాను పుట్టిన గ్రామంపైన మమకారం ఉండడంలో తప్పు లేదని, కాని 99 శాతం గ్రామాల్లో కనీస వౌలికసదుపాయాలు లేవనన్నారు. స్థానిక సంస్థలకు రాజ్యాంగం కల్పించిన నిధులు, విధులు బాధ్యతలను అమలు చేయడం మానివేశారన్నారు. ప్రతి గ్రామానికి రెండు కోట్ల రూపాయలు చొప్పున కనీసం ఇవ్వడం వల్ల ప్రతి గ్రామంలో కనీస సదుపాయాలు కల్పించడం సాధ్యమవుతుందన్నారు. కేవలం ఒక గ్రామానికి నిధులు ఇచ్చి చేతులు దులుపుకుంటే వేలాది గ్రామాలు నష్టపోతాయన్నారు.