తెలంగాణ

వృద్ధుల కళ్లలో ఆనందమే సీఎం కేసీఆర్ లక్ష్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాయపర్తి, జూలై 20: సమాజంలో తల్లిదండ్రులకు సేవ చేసేందుకు వెనుకడుగు వేస్తున్నారని అలాంటి తల్లిదండ్రులకు నేనున్నానంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసరా పెన్షన్ల ద్వారా చేయూతనందిస్తున్నారని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు అన్నారు. వృద్ధుల కళ్లలో ఆనంద చూడాలనే లక్ష్యంతో వృద్ధులకు, వితంతులకు, వికలాంగులకు పెన్షన్‌ను రెట్టింపు చేస్తూ వారి మన్ననలు పొందుతున్న ఘనత దేశంలో ఒక్క కేసీఆర్‌కే దక్కుతుందని అన్నారు. ఆసరా పెన్షన్ పెంపు కార్యక్రమంలో భాగంగా శనివారం వరంగల్ రూరల్ జిల్లా రాయపర్తి మండలంలోని ఎంపీడీవో కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, కలెక్టర్ హరిత పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి దయాకర్‌రావు మాట్లాడుతూ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయలేని పనులు మన ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్నారని, రాష్ట్భ్రావృద్ధి కోసం ముందు చూపుతో అనేక సంక్షేమ కార్యక్రమాలు ప్రారంభించి పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్న మహనీయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీ ఆర్ అని అన్నారు. ఈ రోజు రాష్ట్రంలో పెంచిన పెన్షన్‌తో వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఒంటరి మహిళలు, వారి కళ్లలో ఆనందం చూసి ముఖ్యమంత్రి సంతోషం వ్యక్తం చేస్తున్నారని అన్నారు. మండలంలో 7వేల మూడు వందల 81 మంది లబ్ధిదారుకు ఒక కోటి 60 లక్షల రూపాయలు ప్రభుత్వం అందిస్తున్నట్లు ఆయన తెలిపారు. పుట్టిన ఆడబిడ్డ తల్లిదండ్రులకు భారం కాకుడదని కల్యాణలక్ష్మి పథకాన్ని ప్రవేశపెట్టి ఆడపిల్లలకు అన్నలాగా లక్ష రూపాయలు అందిస్తున్న మన ముఖ్యమంత్రి కాళేశ్వరం ప్రాజెక్టు మూడు సంవత్సరాల్లోనే పూర్తి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో మహేందర్‌జీ, పీడీ సంపత్‌రావు, ఎంపీపీ అనిమిరెడ్డి, జెడ్పీటీసీ రంగుకుమార్, వైస్ ఎంపీప యాకనారాయణ, ఎంపీడీవో రాజయ్య, తదితరులు పాల్గొన్నారు.