తెలంగాణ

స్వయం ఉపాధి పథకాలకు రూ. 32 కోట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 20: స్వయం ఉపాధి పథకాల అమలు కోసం తెలంగాణ ప్రభుత్వం 31.70 కోట్ల రూపాయలు విడుదల చేసింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ది శాఖ కమిషనర్ విజ్ఞప్తి మేరకు నిధులు విడుదల చేశారు. ఇందుకు అనుగుణంగా శనివారం జీఓ (ఆర్‌టీ నెంబర్ 420) జారీ అయింది. ఈ నిధుల విడుదలకు ఆర్థికశాఖ అవసరం లేదని పంచాయతీరాజ్ ముఖ్యకార్యదర్శి వికాస్‌రాజ్ తెలిపారు. ఆందువల్ల నిధులు వేగంగా సంబంధిత అధికారులకు చేరతాయి. పేదరిక నిర్మూలన కోసం ‘సొసైటీ ఫర్ ఎలిమినేషన్ ఆఫ్ రూరల్ పావర్టీ’ (సెర్ప్) పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ అధీనంలో పనిచేస్తోంది. ఈ సొసైటీ నేతృత్వంలో గ్రామీణ ప్రాంతాల్లో పేదలకు ఆర్థికంగా చేయూత ఇచ్చేందుకు, పేదల ఆర్థిక స్థితి మెరుగుపడేందుకు, స్వయం ఉపాధి పథకాలు చేపట్టేందుకు ఈ సంస్థ పనిచేస్తోంది. ప్రజలకు వేగంగా సేవలు అందించేందుకు ఈ సంస్థ గ్రామాల్లోని పేదలతో కలిసి పనిచేస్తోంది. పేదప్రజలకు ఉపాధికి సంబంధించిన వివిధ పనుల్లో శిక్షణ ఇవ్వడం, వివిధ పథకాలు, కార్యక్రమాలను అమలు చేయడంలో సెర్ప్ నిరంతరం పనిచేస్తోంది. గ్రామీణ ప్రజల కోసం 2019-20 సంవత్సరంలో ఇప్పటికే ఈ శాఖ ద్వారా 101 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ప్రస్తుతం అదనంగా నిధులు విడుదల అయ్యాయి.