తెలంగాణ

రాష్ట్రంలో ప్రతి విద్యార్థికీ డిగ్రీలో ప్రవేశం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: రాష్ట్రంలో మూడు విడతల్లో నిర్వహించిన డిగ్రీ అడ్మిషన్లలో సీట్లు పొందని వారు అవకాశాలను కోల్పోరాదనే భావనతో వారికోసం తాజాగా మరోమారు కౌనె్సలింగ్ నిర్వహించనున్నట్టు దోస్త్ కన్వీనర్ ప్రొఫెసర్ ఆర్ లింబాద్రి చెప్పారు. ఇందుకోసం అవసరమైతే నిబంధనలు సరళతరం చేస్తామని అన్నారు. శనివారం నాడు దోస్త్ కమిటీ సమావేశం జరుగుతుందని, ఈ భేటీలో తదుపరిషెడ్యూలు ఖరారు చేస్తామని ఆయన వెల్లడించారు. కాలేజీల్లో సీట్లు పొందిన వారు, పొందని వారు , తొలి ప్రాధాన్యత సీట్లు పొందనివారు కూడా ఈసారి కౌనె్సలింగ్‌లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవచ్చని తెలిపారు. సీట్లు పొంది వివిధ కాలేజీల్లో చేరిన వారు , కాలేజీల్లో చేరిన తర్వాత టీసీలు వెనక్కు తీసుకున్న వారి పరిస్థితిపై చర్చిస్తామని, వారికి మరో అవకాశం కల్పించే యోచన చేస్తామని అన్నారు.
ఈ నెల 21 వరకూ వెబ్ ఆప్షన్ల గడువు ఇచ్చామని, దానిని పొడిగించే అవకాశం ఉందని అన్నారు. గతంలో సీట్లు పొంది ఓటీపీని సంబంధిత కాలేజీల్లో ఇవ్వని వారు ఈసారి వెబ్ ఆప్షన్లు ఇవ్వవచ్చని తెలిపారు. తొలి ప్రాధాన్యత సీట్లు పొందిన వారు మరోమారు కాలేజీలను మారాలని భావించడంలో అర్ధం లేదని అన్నారు. గతంలో వారు కోరుకున్న కాలేజీలోనే సీటు వచ్చినపుడు ఇంతకాలం తర్వాత మరో కాలేజీకి వెళ్లాలని కోరుకోవడం ఏమిటని పేర్కొన్నారు. ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు విద్యార్థులను ప్రలోభపెడుతున్నట్టు తమకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు వస్తున్నాయని, గతంలో కామారెడ్డి ప్రభుత్వ కాలేజీలో చేరిన విద్యార్థులను ఒక ప్రైవేటు కాలేజీ అన్నీ ఉచితంగా ఇస్తామని పేర్కొని ప్రలోభపెట్టిందని, విద్యార్థులకు వాస్తవాలు తెలియక కాలేజీలు మారే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.
వాస్తవిక సమస్యలతో ఏ విద్యార్థి వచ్చినా వాటిని పరిష్కరించేందుకు దోస్త్ కమిటీ సిద్ధంగా ఉందని, అయితే వేరొకరి ప్రలోభాలకు లొంగేవారికి అవకాశం కల్పించడంలో అర్ధం లేదని అన్నారు. మంచి కాలేజీల్లో చేరిన తర్వాత కూడా ఆయా కాలేజీలు వద్దని కొంత మంది విద్యార్థులు వస్తున్నారని, వారు చెప్పే కారణాలు సహేతుకంగా ఉండటం లేదని, వీటన్నింటినీ దోస్త్ కమిటీ భేటీలో చర్చిస్తామని చెప్పారు. ఇప్పటికే కాలేజీల యాజమాన్యాలకు, విద్యార్థులకు చాలా స్పష్టమైన ఆదేశాలు ఇచ్చామని అయితే అనేక అనుమానాలతో విద్యార్థులు దోస్త్ కార్యాలయానికి వస్తున్నారని పేర్కొన్నారు.