రాష్ట్రీయం

ఎన్నికల తేదీల నిర్ణయాధికారం ప్రభుత్వానిదే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 19: ఎన్నికల సంఘం స్వయంప్రతిపత్తి సంస్థ అని ఆ సంఘం వ్యవహారాల్లో ప్రభుత్వం జోక్యం చేసుకోదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. రాష్ట్రంలో మున్సిపాలిటీ ఎన్నికలను ఆగస్టు 15వ తేదీలోపల పూర్తి చేస్తామని ఆయన చెప్పారు. శుక్రవారం అసెంబ్లీలో మాట్లాడుతూ పై ప్రకటన చేశారు. కాని ఎన్నికల తేదీలను నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి ఉంటుందన్నారు. ప్రకృతివైపరీత్యాలు, కరవు, పండగలు, శాంతి భద్రతల పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఎన్నికల తేదీలను ప్రభుత్వం నిర్ణయిస్తుందన్నారు. కాని ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎన్నికల సంఘానిదేనన్నారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన వ్యయపరిమితి, ఎన్నికల నిర్వహణ బాధ్యత ఎన్నికల సంఘానినదేనన్నారు. ఈ విషయాల్లో ప్రభుత్వం ఎటువంటి పరిస్థితుల్లో జోక్యం చేసుకోదన్నారు. ఎవరికి అసౌక్యం కలుగకుండా అందరినీ దృష్టిలో పెట్టుకుని ఎన్నికల తేదీలను ప్రభు త్వం ప్రకటిస్తుందని ఆయన చెప్పారు.