తెలంగాణ

రైల్వే గుర్తింపు యూనియన్ ఎన్నికల్లో సందడే సందడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 12: దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో గుర్తింపు కార్మిక యూనియన్ ఎన్నికల సందడి ప్రారంభమైంది. ఆగస్టు 28, 29 తేదీల్లో పోలింగ్ జరుగనున్నది. 80 వేల మంది ఉద్యోగులు ఓటింగ్‌లో పాల్గొనున్నారు. దక్షిణ మధ్య రైల్వే జోన్‌లో 6 డివిజన్‌లు ఉన్నాయి. హైదరాబాద్, సికిందరాబాద్, గుంతకల్, నాందేడ్, విజయవాడ, గుంటూరు డివిజన్లు ఉన్నాయి. యూనియన్ ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు. ప్రతి నాలుగేళ్లకు ఒకసారి గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరగాలి. అయితే మూడున్నర సంవత్సరాలు ఎన్నికలను నిర్వహించకుండా జాప్యం చేశారు. 2013లో గుర్తింపు యూనియన్ ఎన్నికలు జరిగాయి. ఆ ఎన్నికల్లో ఎంప్లారుూస్ సంఘ్ (కాంగ్రెస్ అనుబంధ సంస్థ) గెలిచింది. రెండవ స్థానంలో మజ్దూర్ యూనియన్ నిలిచింది. ప్రస్తుతం ఎన్నికల్లో నాలుగు కార్మిక యూనియన్లు గుర్తింపు యూనియన్ కోసం పోటాపోటీగా దిగుతున్నాయి. ఎన్నికల్లో పోటీ చేయడానికి, లేని నిబంధనలు తీసుకురావడం పట్ల కొత్తగా పోటీ చేస్తున్న కార్మిక యూనియన్లు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. పోటీ చేసే యూనియన్ తప్పనిసరిగా డిపాజిట్ సొమ్ము అక్షరాల లక్ష రూపాయలు చెల్లించాలనే నిబంధనను యూనియన్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ఓటర్లలో 30 శాతం పోటీ చేసే యూనియన్‌కు ఓటింగ్ ఉండాలన్న నిబంధనను సడలించాలని కొత్త యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఎన్నికల నిబంధనల మేరకు ప్రతి యూనియన్‌కు కనీసం 24 వేల ఓట్ల శాతం ఉండాలన్న నియమం పట్ల కొత్త యూనియన్‌లు వ్యతిరేకిస్తున్నాయి. అయితే రైల్వే ఎన్నికల అధికారులు ఈ విషయాన్ని పరిశీలిస్తామని చెబుతున్నా అమలులోకి రాకపోవడం పట్ల యూనియన్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఈనెల 15లోపు ఎన్నికలకు సంబంధించిన అభ్యంతరాలు ఉంటే దృష్టికి తీసుకురావాలని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. ప్రతి 500 మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తారు. రెండు రోజుల పాటు పోలింగ్ కేంద్రాలు పనిచేసే విధంగా ఏర్పాటు చేయనున్నారు. ఒక రైల్వే స్టేషన్‌లో ఉన్న సిబ్బందిలో 50 శాతం మంది తొలిరోజు ఓటు వేస్తే మిగతా సిబ్బంది రెండవ రోజు ఓటింగ్‌లో పాల్గొంటారు. ఒకేరోజు పోలింగ్‌కు ఏర్పాటు చేస్తే రైళ్ళ రాకపోకల నిర్వహణకు ఇబ్బందులు ఉంటాయన్న నేపథ్యంలో రెండు రోజుల పాటు పోలింగ్‌ను ఏర్పాటు చేయనున్నారు. కొత్తగా రైల్ మజ్దూర్ యూనియన్, భారతీయ మజ్దూర్ సంఘ్ ఎన్నికల్లో పోటీకి ఆసక్తి చూపిస్తున్నాయి. ఎన్నికల్లో పోటీ చేసే కార్మిక యూనియన్లు రైల్వేకి ఎలాంటి పాతబాకీలు లేవని అఫిడవిట్ ఇవ్వాల్సి ఉంటుంది. రైల్వే భవనాలను యూనియన్లు తమ కార్యాలయాలు కోసం వినియోగిస్తున్నాయి. అలాగే యూనియన్ నేతల ట్రావెలింగ్ కోసం రైళ్లను ఉపయోగిస్తుంటారు. కార్యాలయాల్లో టెలిఫోన్ సౌకర్యాలను వినియోగిస్తుంటారు. ఇలా ప్రతిపని కోసం రైల్వే ఆస్తులను ఉపయోగిస్తున్నందున అందుకు ఖర్చు చేసిన వివరాలు ఎన్నికల అధికారులకు చెప్పాల్సి ఉంటుంది. 2013 నుంచి ఇప్పటివరకు ఉన్న యూనియన్ నేతలు కోట్లాది రూపాయలు ఖర్చు చేశారని కొత్త యూనియన్లు ఆరోపిస్తున్నాయి. గతంలో పనిచేసిన ప్రధాన కార్మిక యూనియన్లు ఎంప్లారుూస్ సంఘ్, మజ్దూర్ యూనియన్లు కోట్లాది రూపాయలు రైల్వేకి చెల్లించాల్సి ఉందని కొత్త యూనియన్లు గుర్తు చేస్తున్నాయి. గతంలో ఎన్నికలు 2013లో జరిగాయని, మళ్ళీ ఎన్నికలు నిర్వహించడానికి దాదాపు 7 సంవత్సరాల కాలం పట్టిందని కొత్త యూనియన్లు గుర్తుచేస్తున్నాయి. ఎన్నికల సకాలం నిర్వహించకుండా జాప్యం చేయడాన్ని సవాల్ చేస్తూ కొత్త యూనియన్ ఆర్‌ఎంయూ సుప్రీం కోర్టుకు వెళ్లింది. దీంతో ఎన్నికలు తక్షణం నిర్వహించాలని సుప్రీం కోర్టు సూచనలు ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఆగస్టులో ఎన్నికల పోలింగ్‌కు రైల్వే అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూలై 15 తర్వాత ఓటర్ల లిస్టు యూనియన్లకు ఇవ్వనున్నారు. ఓటర్ల లిస్టులో అభ్యంతరాలు ఏమైనా ఉంటే ఈనెల 25వ తేదీలోగా యూనియన్లు అధికారుల దృష్టికి తీసుకురావాల్సి ఉంటుంది. వచ్చే డిసెంబర్‌లో యూనియన్లు తమ పాతబాకీలను రైల్వేకి చెల్లించాలని రైల్వే ఎన్నికల అధికారులు సూచించడం పట్ల కొత్త యూనియన్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి.
ఎన్నికల నామినేషన్ ముందే గత రెండు యూనియన్లు పాతబకాయిలను చెల్లించాలని కొత్త యూనియన్లు డిమాండ్ చేస్తున్నాయి. ఏదిఏమైనా రైల్వే యూనియన్ గుర్తింపు ఎన్నికలు రసవత్తరంగా మారనున్నాయి.