తెలంగాణ

విద్యుత్ అవసరాల కోసం 2200 మెగావాట్ల విద్యుత్ కొనుగోలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 11: రాష్ట్రంలో తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా భారీ నీటి ప్రాజెక్టుల రిజర్వాయర్లలో నీటి మట్టాలు పడిపోవడంతో విద్యుత్ కొరత ఏర్పడింది. విద్యుత్ అవసరాల కోసం ప్రైవేట్ రంగాల నుంచి తెలంగాణ ప్రభుత్వం విద్యుత్‌ను కొనుగోలు చేస్తోంది. సింగరేణి థర్మల్ విద్యుత్ కేంద్రం నుంచి 1170 మెగావాట్లు, చత్తీస్‌గఢ్ నుంచి 500 మెగావాట్లు, తెలంగాణలో ఉన్న ప్రైవేట్ విద్యుత్ ప్లాంట్ల నుంచి 2200 మెగావాట్లును ప్రభుత్వం కొనుగోలు చేస్తోంది. తెలంగాణ థర్మల్ కేంద్రాల నుంచి 3400 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేస్తున్నారు. అయితే, రాష్ట్ర అవసరాల కోసం బయటి నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేయకతప్పలేదు. కేంద్రం నుంచి 1700 మెగావాట్ల విద్యుత్‌ను దిగుమతి అవుతోంది. ఆంధ్రా నుంచి తెలంగాణకు రావాల్సిన వాటాలో ఒక మిలియన్ యూనిట్స్ విద్యుత్ మాత్రమే వస్తోంది. తెలంగాంలో సోలార్, విండ్‌పవర్, థర్మల్ కేంద్రాల నుంచి విద్యుత్‌ను కొనుగోలు చేస్తున్నారు. రాష్ట్రంలో వర్షాలు అనుకున్నట్లుగా కురిస్తే విద్యుత్ మరింత అవసరం ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ముందుగా విద్యుత్ కొనుగోలుకు సిద్ధం అవుతోంది.