తెలంగాణ

కారు జోరు.. సంబరాల హోరు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: శాసన మండలి ఎన్నికల్లో ఆరు స్థానాలకు పోటీ జరిగితే నాలుగు స్థానాల్లో టిఆర్‌ఎస్ అభ్యర్థులు విజయం సాధించడంతో ఆ పార్టీ నాయకులు, శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. ఫలితాలు ప్రకటించగానే జిల్లాల్లోని పార్టీ కార్యాలయాల్లోను, ఇటు తెలంగాణ భవన్‌లోను బాణాసంచా కాల్చి విజయోత్సవాలు జరుపుకున్నారు. తాము ఊహించినట్టుగానే ఫలితాలు వచ్చాయని టిఆర్‌ఎస్ నాయకులు తెలిపారు. నల్లగొండ జిల్లాలో టిఆర్‌ఎస్ క్యాంపులో ఎక్కువ మంది ఉన్నా, వాళ్లు ఏడాది ముందుగానే కోమటిరెడ్డి వెంకటరెడ్డికి హామీ ఇవ్వడంతో ఫలితం ఎటైనా రావచ్చునని ముందే ఊహించామని పార్టీ నాయకులు తెలిపారు.
మహబూబ్‌నగర్ జిల్లాలో ఒక స్థానంలో కాంగ్రెస్ గెలుస్తుందని టిఆర్‌ఎస్ ముందు నుంచి అంచనా వేసింది. ఖమ్మం జిల్లాలో అన్నిపార్టీలు ఏకమై పోటీ చేసినా టిఆర్‌ఎస్ విజయం సాధించడం పట్ల నాయకులు సంతోషంలో మునిగితేలుతున్నారు. తుమ్మల నాగేశ్వరరావు నాయకత్వంలో జిల్లాలో నాయకులంతా ఐక్యంగా పనిచేసి విజయం సాధించారని పార్టీ నాయకత్వం అభినందించింది. ఎన్నికల ఫలితాలు వెలువడిన తరువాత రంగారెడ్డి జిల్లా నుంచి గెలిచిన శంభీపూర్ రాజు ముఖ్యమంత్రిని కలిశారు. ముఖ్యమంత్రి తనపై విశ్వాసం ఉంచి టికెట్ ఇచ్చారని, మొత్తానికి విజయం సాధించామని, జిల్లా అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు.
ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్, టిడిపి కుమ్మక్కు అయినా టిఆర్‌ఎస్ విజయం సాధించిందని అన్నారు. నల్లగొండ జిల్లాలో కాంగ్రెస్, టిడిపి ఏకం కావడంతో టిఆర్‌ఎస్ అభ్యర్థి ఓడిపోయారని టిఆర్‌ఎస్ నాయకుడు గట్టు రామచంద్రరావు అన్నారు. టిడిపి తెలంగాణలో చచ్చిపోయిందని మండలి ఎన్నికలతో మరోసారి నిరూపితం అయిందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కొన ఊపిరితో ఉందని అన్నారు. తెలంగాణను అభివృద్ధి పథం వైపునడిపించే నాయకుడు కెసిఆర్ మాత్రమేనని గ్రామ స్థాయిలో ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. విజయం సాధించిన రంగారెడ్డి జిల్లా నాయకులను ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు క్యాంపు కార్యాలయంలో అభినందించారు.
మొత్తం 12 మండలి స్థానాల్లో టిఆర్‌ఎస్ 10 స్థానాల్లో విజయం సాధించింది. పార్టీకి ఇది శుభసూచకమని పార్టీ నాయకులు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి, సిఎల్‌పి నాయకుడు జానారెడ్డిలకు సొంత జిల్లా నల్లగొండలో పట్టు ఉండడం వల్ల కాంగ్రెస్ అభ్యర్థివిజయం సాధించారని, ఈ జిల్లాపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఉందని టిఆర్‌ఎస్ నాయకులు అభిప్రాయం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌లో హేమాహేమీలైన నాయకులు ఉండగా, టిఆర్‌ఎస్ నుంచి మంత్రి జగదీశ్‌రెడ్డి మాత్రమే గట్టి నాయకుడు ఉన్నారు. మరోవైపు ఉద్యమ సమయంలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి చురుగ్గా ఉండడం, మంత్రిపదవికి రాజీనామా చేయడం వంటి వాటి వల్ల ఆయన సోదరుడి విజయం సాధ్యం అయిందని జిల్లా నాయకులు చెబుతున్నారు.