తెలంగాణ

కొత్త కోర్సులను ఆఫర్‌చేస్తున్న సీపెట్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 25: ప్రాచుర్యంలో ఉన్న ఇంజనీరింగ్ తదితర కోర్సుల కంటే అత్యుత్తమ భవితను, ఉపాధి గ్యారంటీని ఇచ్చే కోర్సులను సీపెట్ ఆధ్వర్యంలోని సెంటర్ ఫర్ స్కిల్లింగ్ టెక్నికల్ సపోర్టు సంస్థ అందిస్తోందని ఆ సంస్థ డైరెక్టర్ ఏవీఆర్ కృష్ణ పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని సీపెట్ సంస్థ డిప్లొమో, పోస్టు డిప్లొమో, పీజీ డిప్లొమో కోర్సులలో చేరేందుకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోందని అన్నారు. డిప్లొమో ఇన్ ప్లాస్టిక్ టెక్నాలజీ మూడేళ్ల కోర్సు, డిప్లోమో ఇన్ ప్లాస్టిక్ వౌల్డ్ టెక్నాలజీ మూడేళ్ల కోర్సు ఆఫర్ చేస్తున్నామని, టెన్త్ పాసైన వారు దీంట్లో చేరవచ్చని అన్నారు. డిప్లొమో పాసైన వారు పోస్టు డిప్లొమో ఇన్ ప్లాస్టిక్ వౌల్డ్ డిజైన్ విత్ కేడ్ క్యామ్ కోర్సుల్లో చేరవచ్చని, బిఎస్సీ పాసైన వారు పీజీ డిప్లొమో ఇన్ ప్లాస్టిక్ ప్రాసెసింగ్ అండ్ టెస్టింగ్ కోర్సులో చేరవచ్చని అన్నారు. ఈ కోర్సులు చేసిన వారికి దేశ, విదేశాల్లో వివిధ ప్లాస్టిక్ కంపెనీల్లో ఉద్యోగావకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు. ఇందుకోసం అభ్యర్థులు ఈఅడ్మిషన్ డాట్ సీపెట్ డాట్ జీవోవీ డాట్ ఇన్ అనే వెబ్ పోర్టల్‌ను సందర్శించాలని ఇతర వివరాలకు 9959333414 నెంబర్‌లో కూడా సంప్రదించవచ్చని చెప్పారు.