తెలంగాణ

కాళేశ్వరంతో 45 లక్షల ఎకరాల ఆయకట్టు సాధ్యమా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 19: కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా 45 లక్షల ఎకరాల ఆయకట్టు సాగునీరుతో పాటు పరిశ్రమలకు, తాగునీటికి అవకాశం కల్పిస్తున్నట్టు స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం సరైంది కాదని ఆల్ ఇండియాకిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు 18.25 లక్షల ఎకరాల ఆయకట్టును మాత్రమే గుర్తించారని, శ్రీరాంసాగర్, నిజాంసాగర్ , సింగూరు ప్రాజెక్టులను కలిపి మరో 18.83 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని, రెండు ఆయకట్లు కలిపి 37.08 లక్షల ఎకరాలకు నీరు అవసరమని అన్నారు. ప్రస్తుతం శ్రీరాంసాగర్ ద్వారా 70 నుండి 80 టీఎంసీలు మించి నీరు రావడం లేదని, 121 టీఎంసీలు నిలువ శక్తి ఉన్న శ్రీరాంసాగర్‌లో పూడిక ఉన్నందున ప్రస్తుతం 85 టీఎంసీలే ఉన్నాయని, అది కూడా ఏడాదిలో ఒకటి లేదా రెండుసార్లు మాత్రమే నిండుతోందని గుర్తుచేశారు. కాళేశ్వరం ద్వారా 225 టీఎంసీల లభ్యత ఉన్నట్టు ప్రభుత్వం ప్రకటించినా కాళేశ్వరం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టు నీరు కలిపి 300 టీఎంసీలు మాత్రమే లభ్యమవుతోందని పేర్కొన్నారు. 45 లక్షల ఎకరాలకు 600 టీఎంసీల నీరు అవసరం అవుతుందని, ప్రస్తుతం నాగార్జున సాగర్‌లో 22 లక్షల ఎకరాల ఆయకట్టుకు 280 టీఎంసీల కేటాయింపు ఉందని, ఆ విధంగా చూసినా మెట్టకు ఒక టీఎంసీ 10వేల ఎకరాలకు, మాగాణికి ఒక టీఎంసీకి 6వేల ఎకరాలకే నీరు వస్తుందని, కాళేశ్వరం, శ్రీరాంసాగర్ ప్రాజెక్టుల కింద మెట్ట పంటలు వేసినా 450 టీఎంసీలు, తాగునీటికి, పరిశ్రమలకు మరో 50 టీఎంసీలు కావాలని, ఎలా చూసినా 500 నుండి 600 టీఎంసీల నీరు అవసరం అవుతుందని పేర్కొన్నారు.