తెలంగాణ

ములుగు జిల్లాలో మావోల కదలికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూన్ 11: ములుగు జిల్లాలో మావోల కదలికలను పోలీసులు గుర్తించారు. పోలీసులను టార్గెట్ చేస్తూ కల్వర్టుల కింద టిఫిన్ బాక్సులు పెట్టే క్రమంలో ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులను మట్టుపెట్టాలనే మావోయిస్టుల ఆదేశాలతో కల్వర్టు కింద టిఫిన్ బాక్స్ బాంబు పెడుతున్న ఇద్దరు మావోయిస్టు సానుభూతిపరులను అరెస్ట్ చేసి రిమాండ్‌కు పంపినట్లు ములుగు జిల్లా ఏటూరునాగారం ఏఎస్పీ శరత్ బుధవారం తెలిపారు. మావోయిస్టులపై ఈ ప్రాంతంలో పోలీస్ కూంబింగ్‌లు ఎక్కువ జరుపుతున్నారని, దీంతో అజ్ఞాత దళాల ఉనికి దెబ్బతింటుందన్న ఉద్దేశంతో ములుగు జిల్లా వెంకటాపురం మండలానికి చెందిన కుప్పం రమేష్, మీడియం చిన్న లక్ష్మయ్యలు సీపీఐ మావోయిస్టు పార్టీ వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీతో పరిచయం ఏర్పడింది. మావోయిస్టులకు వీరు చెప్పిన పనులు చేస్తూ సహకరిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. అందులో భాగంగానే బుధవారం తెల్లవారుజామున అజ్ఞాత దళం వాజేడు, వెంకటాపురం ఏరియా కమిటీ దళ సభ్యుల పిలుపు మేరకు అక్కడికి వెళ్లగా, వారికి మావోయిస్టులు కొత్తపల్లి క్రాస్ రోడ్డు వద్ద ఉన్న కల్వర్టు కింద టిఫిన్ బాక్స్ బాంబ్ పెట్టాలని ఆదేశించి రెండు టిపిన్స్ బాక్సులు ఇచ్చి పంపారు. వీటిని కల్వర్టు కింద పెట్టే ప్రయత్నంలో అనుమానాస్పదంగా కనిపించిన ఈ ఇద్దరు వ్యక్తులను విచారించగా వారు జరిగిన విషయాన్ని పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకొని రిమాండ్ పంపినట్టు ఏఎస్పీ వెల్లడించారు.