తెలంగాణ

మూడు నగరాల్లో సివిల్స్ కోచింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: తెలంగాణ రాష్ట్రంలో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్‌లో సివిల్ సర్వీస్ కోచింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నట్లు బిసి సంక్షేమ శాఖ మంత్రి జోగు రామన్న తెలిపారు. బుధవారం ఆయన బిసి సంక్షేమంపై సమీక్షించారు. అనంతరం విలేఖర్లతో మాట్లాడుతూ, బిసి స్టడీ సర్కిల్స్‌కు సొంత భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. బిసి కార్పోరేషన్ ఫెడరేషన్ లబ్ధిదారుల ఎంపికలో పారదర్శకతను పాటించాలని, ప్రభుత్వానికి ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవన్నారు. ప్రతి గ్రామంలో గ్రామ సభలను నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేయాలన్నారు. బిసి కార్పోరేషన్ నుంచి రుణ సబ్సిడీ కోసం ఇప్పటి వరకు 1.10 లక్షల దరఖాస్తులు వచ్చాయన్నారు. జనవరి 20వ తేదీలోగా మరిన్ని దరఖాస్తులు వచ్చే అవకాశాలున్నాయన్నారు. బిసి ఫెడరేషన్ దరఖాస్తులను అందచేసే గడువును జనవరి 31వ తేదీ వరకు పొడిగించనున్నట్లు చెప్పారు. గీత కార్మికుల సహకార సంఘాల రిజిస్ట్రేషన్ ప్రక్రియను సత్వరమే పూర్తి చేయాలన్నారు.
ఫిరాయింపులు,
వైఫల్యాలు..
టిఆర్‌ఎస్ పాలనపై టిడిపి ధ్వజం
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, డిసెంబర్ 30: టిఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రజలకు 18నెలల పాలనలో 3డి సినిమా చూపించిందని, ఫిరాయింపులు, వైఫల్యాల సంవత్సరంగా 2015 మిగిలిపోతుందని టిడిపి ఎమ్మెల్యే కెపి వివేకానంద గౌడ్ ధ్వజమెత్తారు. బుధవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ టిఆర్‌ఎస్ పార్టీ సచివాలయాన్ని పార్టీ కార్యాలయంగా మార్చివేసి ఇతర పార్టీల నేతలను చేర్చుకుందన్నారు. ఖమ్మంలో నాలుగు ఓట్లున్న టిఆర్‌ఎస్ గెలవడానికి కారణం తుమ్మల నాగేశ్వరరావు పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించడమేనన్నారు. తుమ్మల తెలంగాణ భజన్‌లాల్‌గా మారారన్నారు. రాష్ట్రంలో రెండు వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటే ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు. హైదరాబాద్‌లో వరుసగా చైన్ స్నాచింగ్ సంఘటనలు జరుగుతుంటే నిందితులను పట్టుకోవడంలో పోలీసులు విఫలమయ్యారన్నారు. కెసిఆర్ మాటలకు చేతలకు పొంతనలేకుండా పాలన సాగుతోందన్నారు. మెట్రో రైలు ప్రణాళిక చంద్రబాబుదన్నారు. స్పీకర్ సరైన నిర్ణయాలు తీసుకోకుండా ముఖ్యమంత్రి కెసిఆర్ అడ్డుపడుతున్నారని ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ ప్రజలకు అండగా ఉంటుందని, కొత్త సంవత్సరంలో ప్రజావ్యతిరేక విధానాలపై పోరు కొనసాగిస్తామన్నారు.

‘మేడిగడ్డ’పై సంయుక్త సర్వే

మహాదేవపూర్, డిసెంబర్ 30: రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న మేడిగడ్డ ఎత్తిపోతల పథకం నిర్మాణానికి బుధవారం తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల ఇంజనీర్ల బృందం హెలికాప్టర్ ద్వారా క్షేత్రస్థాయిలో పర్యటించింది. ఇరు రాష్ట్రాలకు చెందిన ఇంజనీర్ల అత్యున్నత స్థాయి బృందం బుధవారం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహించింది. కరీంనగర్ జిల్లా మహాదేవపూర్ మండలంలోని మేడిగడ్డ, కాళేశ్వరంతో పాటు మహారాష్టల్రలోని పోచంపల్లి, నడికుడ ప్రాంతాల్లో బుధవారం హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వేతో పాటు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ముఖ్యమంత్రి కెసిఆర్, భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీష్‌రావు, రాష్ట్ర ముఖ్యకార్యదర్శి నేతృత్వంలో తాజాగా మంగళవారం హైదరాబాద్‌లో జరిగిన సంయుక్త సమన్వయ సమావేశంలో తీసుకున్న నిర్ణయం మేరకు బుధవారం మేడిగడ్డ, కాళేశ్వరంలో క్షేత్రస్థాయి పర్యటన చేసినట్లు ఇంజనీర్ల బృందం కాళేశ్వరంలో విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. అంతకుముందు వారు మండలంలోని మేడిగడ్డ వద్ద గోదావరి నీటి పారకం తీరును పరిశీలించారు. మేడిగడ్డ వద్ద బ్యారేజి నిర్మాణం వల్ల ముంపునకు గురయ్యే భూములను వారు కాలినడకన పరిశీలించారు. అనంతరం అక్కడికి చేరుకున్న ప్రజలతో వారు మాట్లాడారు. సాగు భూములు సైతం ముంపునకు గురయ్యే పరిస్థితిపై రైతులు ఎలాంటి ఆందోళన చెందనవసరం లేదని వారు భరోసా కల్పించారు. ముంపునకు గురికాకుండా బ్యారేజి నిర్మాణం చేపట్టుటకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశించారని, అందుకు అనుగుణంగా తాము క్షేత్రస్థాయిలో పర్యటించి తదుపరి నివేదికలు రూపొందిస్తామని వారు వెల్లడించారు.
కాళేశ్వరంలో, మహారాష్ట్ర సరిహద్దులోని పోచంపల్లి, నడికుడ ప్రదేశాల్లోని ప్రజలతో ముఖాముఖిగా చర్చించామని వారు వెల్లడించారు. హెలికాప్టర్ ద్వారా జరిగిన ఏరియల్ సర్వే, క్షేత్రస్థాయి సంయుక్త పరిశీలనలో తెలంగాణ రాష్ట్రంలోని ప్రాణహిత చేవెళ్ళ ఎత్తిపోతల పథకం ముఖ్య ఇంజనీర్ హరిలాల్, మహారాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ఇంజనీర్ ఆర్‌ఎం చౌహన్, కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ముఖ్య ఇంజనీర్ నల్ల వేంకటేశ్వర్లు, చేవెళ్ళ ప్రాజెక్టు ఎస్‌ఈ పి.వేంకటరాములు, డిఇ నూనే శ్రీ్ధర్, ఏఈ ఎం శ్రీనివాస్, మహాదేవపూర్ తహసీల్దార్ సతీష్‌కుమార్, మహారాష్ట్ర ప్రభుత్వంలోని నాగపూర్ ఎస్‌ఈ కులదీప్ రిత్విక్, చెరుపూర్ ఎస్‌ఈ షేక్, ఈఈ ఎస్‌ఎం దాబాడే, దిల్లీ వాజోల్ ప్రాజెక్టు సీనియర్ జనరల్ మేనేజర్ షాంభూ ఆజాద్ పాల్గొన్నారు.

కాళేశ్వరంలో గోదావరి ప్రవాహాన్ని పరిశీలిస్తున్న
తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల ఇంజనీర్ల బృందం