తెలంగాణ

మధ్యంతర భృతి 43 శాతం ఇవ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 25: తెలంగాణలోని ప్రభుత్వ ఉద్యోగులకు 43 శాతం మధ్యంతర భృతిగా ప్రకటించాలని తెలంగాణ నాన్-గెజిటెడ్ ఆఫీసర్స్ యూనియన్ కేంద్ర కమిటీ (టీఎన్‌జీఓల యూనియన్) డిమాండ్ చేసింది. టీఎన్‌జీఓల రాష్ట్ర సంఘం అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి అధ్యక్షతన శనివారం ఇక్కడ జరిగిన కేంద్ర సంఘం కార్యవర్గ సమావేశంలో పలు తీర్మానాలు చేశారు. గత ఏడాది కాలంలో రాష్ట్రంలో వివిధ రకాల ఎన్నికలు వచ్చాయని, అందుకే ఉద్యోగుల సమస్యల సాధనలో జాప్యం జరిగిందని రవీందర్‌రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఎన్నికలు ముగిసినందువల్ల ఉద్యోగుల సమస్యలను సానుభూతితో ప్రభుత్వం పరిష్కరించాలని కోరారు. ఈ సందర్భంగా సమావేశంలో చేసిన తీర్మానాలను సంఘం ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్ మీడియాకు విడుదల చేశారు. ఈ సమావేశంలో కేంద్ర సంఘం అసోసియేట్ అధ్యక్షురాలు బండారు రేచల్, కోశాధికారి రామినేని శ్రీనివాసరావు, సంఘం రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.