తెలంగాణ

కెటిఆర్‌కు హార్వర్డ్ వర్సిటీ ఆహ్వానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 30: ఐటిశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావుకు ప్రతిష్టాత్మక హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పిలుపు వచ్చింది. యూనివర్సిటీ నిర్వహించే సదస్సులో ప్రసంగించాలని ఆయనను ఆహ్వానించింది. ‘డిజిటల్ ఇండియా ఆలోచనల నేపథ్యంలో స్టార్టప్‌ల భవిష్యత్తు’, ‘సాంకేతిక విప్లవం నేపథ్యంలో దేశ సమగ్రాభివృద్ధి’ అనే రెండు అంశాలపై కెటిఆర్ ప్రసంగిస్తారు. పలు అవార్డులతో దేశం దృష్టిని ఆకర్షిస్తున్న కెటిఆర్‌కు హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగించే అరుదైన అవకాశం లభించింది. 2016 ఫిబ్రవరి ఆరు, ఏడు తేదీల్లో జరిగే వార్షిక సదస్సులో ఆయన ప్రసంగించనున్నారు.
ప్రపంచవ్యాప్తంగా సుమారు వెయ్యి మంది హాజరయ్యే ఈ సదస్సును హార్వర్డ్ యూనివర్సిటీలోని హార్వర్డ్ బిజినెస్ స్కూల్, హార్వర్డ్ కెన్నడి స్కూల్స్ సంయుక్తంగా నిర్వహిస్తాయి. అమెరికాలో జరిగే పలు ప్రఖ్యాత సదస్సుల్లో ఇండియా కాన్ఫరెన్స్ ఒకటి. భారత్‌లో అవకాశాలు, సవాళ్లు అనే అంశంపై జరిగే సదస్సులో ప్రసంగించాలని మంత్రిని కోరారు. ప్రపంచంలో బలీయమైన శక్తిగా ఎదుగుతున్న భారత్ స్థితిగతులపై చర్చించే ఈ సమావేశంలో ప్రముఖ పారిశ్రామిక వేత్తలు, పలు రంగాల్లోని ప్రముఖులను ఈ వేదిక ఒక చోటుకు తీసుకురానుంది.
భారతదేశంలో అభివృద్ధి పరిణామ క్రమంలో సాంకేతిక పరిజ్ఞానం పాత్ర, ఉపయోగాలు సవాళ్లు అనే అంశంపై సదస్సు కూలంకుషంగా చర్చిస్తుంది. దీనికోసం హార్వర్డ్ కెన్నడి స్కూల్ డిజిటల్ ఇండియాపై చర్చను చేపట్టింది. స్టార్టప్‌ల కాలంలో వ్యాపారాభివృద్ధి, డిజిటల్ ఇన్నోవేషన్ అండ్ ట్రాన్స్‌ఫర్మేషన్ అనే అంశంపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ చర్చను నిర్వహిస్తుంది. హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్ బృందం మంత్రి కెటిఆర్‌ను కలిసి సమావేశానికి రావాలని ఆహ్వానించింది. ఆహ్వానంపట్ల మంత్రి హర్షం వ్యక్తం చేస్తూ తప్పకుండా హాజరవుతానని తెలిపారు. సాంకేతిక రంగంలో చర్చనియాంశంమైన ఇంటర్నెట్ వినియోగం- అభివృద్ధి, ఓపెన్ డాటా, డిజిటల్, వౌలిక సదుపాయాలు వంటి అంశాలను సామాన్యుల చేంతకు చేర్చే అంశాలపై ప్రసంగించనున్నట్టు కెటిఆర్ తెలిపారు. వీటితోపాటు తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన టి-హబ్ కార్యక్రమం ద్వారా ప్రభుత్వాలు నూతన ఆవిష్కరణలను ఎలా వేగవంతం చేయవచ్చునో వివరించనున్నట్టు చెప్పారు. వ్యాపార వేత్తలతో సమావేశం అయి తెలంగాణలో వ్యాపార అవకాశాలను వివరిస్తానని కెటిఆర్ తెలిపారు.