తెలంగాణ

గుబాళించిన భక్తి పరిమళాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలంగాణ సాకారం అయిన తరువాత పండుగలను అధికారికంగా జరుపుకోవడమే కాకుండా దేశంలో ఎప్పుడూ
జరగని విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టారు. బతుకమ్మ పండుగను కన్నుల పండువగా వారం రోజులపాటు
నిర్వహించారు. అన్ని మతాల పర్వదినాలను అధికారికంగా చేపట్టడంవల్ల ఆథ్యాత్మిక కార్యక్రమాలకు ఊహించని
విధంగా అన్ని మాతాల నుంచి సానుకూల ధోరణి వ్యక్తమైంది. యాదగిరి గుట్టను దాదాపు వెయ్యి ఎకరాల్లో
అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ఆధ్యాత్మికవాదుల మద్దతు పొందింది.
డిసెంబర్ 23 నుంచి 27 వరకు అయుత చండీయాగాన్ని ఘనంగా నిర్వహించి అందరి మన్ననలు పొందారు.

ఈ సంవత్సరం తెలంగాణలో భక్తి పరిమళాలు గుబాళించాయి. సంవత్సరం ప్రారంభం నుంచి చివరివరకు ఆధ్యాత్మిక కార్యక్రమాలు దేశం దృష్టిని ఆకర్షించే విధంగా సాగాయి. తెలంగాణ ఉద్యమమే ఒక రకంగా సాంస్కృతికి విప్లవం. తెలంగాణ సాకారం కావడంలో సాంస్కృతిక పోరాటం ముఖ్యభూమిక పోషించింది. ఈ పోరాటంలో పండుగలను కూడా భాగస్వామ్యం చేశారు. తెలంగాణ సాకారం అయిన తరువాత వాటిని పండుగలను అధికారికంగా జరుపుకోవడమే కాకుండా దేశంలో ఎప్పుడూ జరగని విధంగా ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించారు. మైసూర్‌లో జరిగే దసరా ఉత్సవాల తరహాలో బతకుమ్మ పండుగను ట్యాంక్‌బండ్‌పై నిర్వహించడానికి శ్రీకారం చుట్టారు. కన్నుల పండువగా వారం రోజులపాటు నిర్వహించారు. ఒక మతానికి సంబంధించిన ఆథ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు సహజంగా అధికారంలో ఉన్నవారిపై విమర్శలు వస్తాయి. అయితే ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తూ, అన్ని మతాల పర్వదినాలను అధికారికంగా నిర్వహించడం వల్ల ఊహించని విధంగా ఆథ్యాత్మిక కార్యక్రమాలకు అన్ని మాతాల నుంచి, అన్ని ప్రాంతాల వారినుంచి సానుకూల ధోరణి వ్యక్తమైంది. హిందువుల ప్రతినిధులం అని చెప్పుకునే బిజెపి సైతం నిర్వహించలేని స్థాయిలో అయుత చండీమహాయాగాన్ని నిర్వహించారని వివిధ మతాల స్వామీజీలు సైతం అభినందించే విధంగా డిసెంబర్ 23 నుంచి 27 వరకు చండీయాగం నిర్వహించారు. గంగా జమున తహజీబ్ అని మాటల్లోనే కాకుండా చేతల్లో చూపించే విధంగా తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా ప్రభుత్వం అన్ని మతాలకు ప్రాధాన్యత ఇచ్చింది. అప్పటికే అన్ని మతాలకు ప్రాధాన్యత ఇస్తూ వివిధ కార్యక్రమాలను ప్రకటించడంతో యాగం పట్ల ఇతర మతాల వారి నుంచి సానుకూలతే వ్యక్తం అయింది కానీ విమర్శలు రాలేదు. రంజాన్ సందర్భంగా పెద్ద సంఖ్యలో ముస్లింలకు బట్టల పంపిణీ చేశారు. ప్రభుత్వం అధికారికంగా రంజాన్ నిర్వహించి విందు ఇచ్చింది. అదే విధంగా తొలిసారి క్రిస్మస్‌ను అధికారికంగా నిర్వహించారు. నగరంలో పదికోట్ల రూపాయలతో క్రైస్తవ భవనం నిర్మాణానికి స్థలం కేటాయించారు. నిధులు విడుదల చేశారు. శబరిమలలో తెలంగాణ భవన్ నిర్మాణానికి ఆ రాష్ట్ర ప్రభుత్వం నుంచి స్థలం సేకరించారు. తెలంగాణ సాకారం అయినందుకు విజయవాడ కనకదుర్గా మాతకు మొక్కలు చెల్లించుకోవడానికి ముఖ్యమంత్రి ఏర్పాట్లు చేస్తున్నారు. అదేవిధంగా తిరుపతి శ్రీవేంకటేశ్వర స్వామికి మొక్కులు చెల్లించేందుకు అధికారికంగా ఒక కమిటీ వేశారు. ఒకవైపు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కొనసాగిస్తూనే పెద్దఎత్తున ఆథ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టడంతో భక్త్భివం గల వారినుంచి ప్రభుత్వం మంచి మద్దతు సాధించింది. లక్షలాది మంది గోదావరి పుష్కరాలకు వచ్చినా ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించారు. యాదగిరిగుట్ట అభివృద్ధికి బృహత్ ప్రణాళిక రూపొందించారు. అభివృద్ధి కార్యక్రమాలు సాగుతున్నాయి. ఇప్పటికే రెండువందల కోట్ల రూపాయలు మంజూరు చేశారు. హైదరాబాద్‌కు కేవలం 60 కిలో మీటర్ల దూరంలో ఉన్న యాదగిరి గుట్టను దాదాపు వెయ్యి ఎకరాల్లో అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దడానికి ప్రభుత్వం రూపొందించిన ప్రణాళిక ఆధ్యాత్మికవాదుల మద్దతు పొందింది. వీటన్నిటికి పరాకాష్టగా ముఖ్యమంత్రి మహాచండీయాగం నిర్వహించారు. వ్యక్తిగతంగా సొంత సొమ్ముతో యాగం నిర్వహిస్తున్నానని, ప్రభుత్వం నుంచి పైసా తీసుకోవడం లేదని ముందే ప్రకటించడంతో విమర్శలకు అవకాశం లేకుండా పోయింది. యాగం వల్ల తెలంగాణ, ఆంధ్ర ముఖ్యమంత్రులు కలుసుకోవడానికి అవకాశం లభించింది. తెలంగాణ ఉద్యమ సమయంలో ఇతర ప్రాంతాలకు చెందిన కొంతమంది కెసిఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించిన వర్గాలు సైతం యాగంతో దగ్గరయ్యాయి. గడిచిన 200 సంవత్సరాల్లో చండీయాగం ఎవరూ నిర్వహించక పోవడం, భారీఎత్తున కెసిఆర్ నిర్వహించడంతో అందరి దృష్టినీ ఆకర్షించింది. ఆలయాల టూరిజం అభివృద్ధికి విస్తృతమైన అవకాశాలున్నాయని, ఈ ఏడాది వాటిపై దృష్టిపెడతామని అధికారులు చెబుతున్నారు. యాదగిరిగుట్ట అభివృద్ధి ప్రణాళిక అమలు చేసిన తరువాత దేశంలో ఆలయాల టూరిజంలో తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. ఐటిలోనే కాదు ఆధ్యాత్మికంలోనూ మనమే ముందుంటాం అని అధికారులు చెబుతున్నారు.

చెరిగిపోని
మధుర స్మృతులు

విద్యాలయాల ఈవెంట్స్‌ను ఘనంగా నిర్వహించాలి
తల్లిదండ్రులనూ భాగస్వాములను చేయాలి
విద్యాసంస్థలను ఆదేశించిన ఏపి ప్రభుత్వం

హైదరాబాద్, డిసెంబర్ 30: ఏపిలోని విశ్వవిద్యాలయాలు, కళాశాలల్లో ఏర్పాటు చేసే స్నాతకోత్సవాలు, వార్షికోత్సవాలు, కళాశాల దినోత్సవాలు, క్రీడాదినోత్సవాలు మొదలగు ఈవెంట్స్‌ను భారీ ఎత్తున చేపట్టాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ కార్యక్రమాలు విద్యార్థులు జీవితాల్లో మధుర స్మృతులుగా మిగిలిపోయేలా ఉండాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు విశ్వవిద్యాలయాల వైస్-చాన్స్‌లర్లు, కళాశాల ప్రిన్సిపాళ్లు తదితరులకు బుధవారం ఆదేశాలు జారీ చేశారు. స్నాతకోత్సవం ప్రతి విద్యార్థి జీవితంలో ఎల్లప్పుడూ గుర్తుండేలా నిర్వహించాలని ప్రభుత్వం ఈ ఆదేశాల్లో పేర్కొంది. విద్యార్థులు డిగ్రీలు తీసుకుని సమాజంలో అడుగుపెట్టే సమయంలో నిర్వహించే స్నాతకోత్సవం వారిని ప్రేరేపించే విధంగా నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ప్రముఖ శాస్తవ్రేత్తలు, సామాజిక నిపుణులు, పారిశ్రామిక వేత్తలను ఆహ్వానించి విద్యార్థుల్లో కొత్త ఉత్సాహం కలిగేలా చూడాలని సూచించారు. కేవలం ఒక రోజుకే స్నాతకోత్సవాన్ని పరిమితం చేయకుండా ఎగ్జిబిషన్లు, గ్రూపు చర్చలు నిర్వహించి, విద్యార్థులను, వారి తల్లిదండ్రులను కూడా భాగస్వాములను చేయాలని సూచించారు. కాలేజ్ డే, వార్షికోత్సవం, స్పోర్ట్స్ డేలను నిర్వహించే సమయంలో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను భాగస్యాములను చేయాలని ఉన్నత విద్యాశాఖ కోరింది. సాంస్కృతిక దినోత్సవాలను నిర్వహించే సమయంలో ఆయా ప్రాంతాల సాంస్కృతిక పద్ధతులకు ప్రాధాన్యత లభించేలా చూడాలని కోరారు. మహిళా దినోత్సవాలను నిర్వహించి, విద్యార్థినులలో నూతనోత్సాహం నింపేలా చూడాలని ఆదేశించారు. కాలేజీ పూర్వ విద్యార్థుల సమ్మేళనాలను నిర్వహించి, కాలేజీ అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఎర్రచందనం స్మగ్లర్
మస్తాన్‌వలీ కోసం గాలింపు
చాగలమర్రి, డిసెంబర్ 30: కర్నూలు జిల్లా చాగలమర్రి ఎంపిపి, ఎర్రచందనం స్మగ్లర్ మస్తాన్‌వలీ కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 22న మస్తాన్‌వలి రహస్యంగా వచ్చి మండల పరిషత్ కార్యాలయంలోని రిజిస్టర్‌లో సంతకం పెట్టి వెళ్లినట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో మస్తాన్‌వలీని తిరిగి అరెస్టు చేసేందుకు పోలీసులు వేట ముమ్మరం చేశారు.

- బుద్దా మురళి