తెలంగాణ

అధికారులపై చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఇంటర్ బోర్డు వైఫల్యం నేపథ్యంలో ప్రభుత్వంపై విపక్ష పార్టీలు వత్తిడిని పెంచాయి. ఈ వైఫల్యాలపై విద్యార్థులు, తల్లితండ్రులకు క్షమాపణ చెప్పాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ డిమాండ్ చేశారు. ఈ మేరకు సీఎస్‌కు వినతిపత్రం సమర్పించారు. విద్యార్థులను దగా చేసిన బోర్డు అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో 9.40 లక్షల కుటుంబాల్లో తీవ్ర ఆందోళన నెలకొని ఉందని ఆయన చెప్పారు. ఇది చిన్న తప్పిదంగా బోర్డు కార్యదర్శి పేర్కొనడం అమానుషమని ఆయన మండిపడ్డారు. మానసిక వత్తిడికి గురవుతున్న విద్యార్థులకు ప్రభుత్వం ఊరట ఇచ్చే సమాధానం చెప్పడం లేదన్నారు. బోర్డు వద్ద ధర్నా చేస్తున్న విద్యార్థులు, తల్లితండ్రుల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తిస్తున్నారని లక్ష్మణ్ ఆరోపించారు. అధికారుల సమన్వయ లోపంతోనే తప్పిదాలు జరిగినట్లు ప్రభుత్వం ప్రచారం చేయడం సిగ్గుచేటన్నారు. సాంకేతిక తప్పిదాలు, తప్పుగా మార్కులు వేయడం, వాల్యూయేషన్‌లో లోపాల వల్ల ప్రతిభావంతులైన విద్యార్థులు కూడా నష్టపోయారని బీజేపీ నేత ఆందోళన వ్యక్తం చేశారు. పీసీసీ వర్కింగ్ అధ్యక్షుడు పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇంటర్ బోర్డు వైఫల్యాలకు కారణమైన ఏజన్సీపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆయన గవర్నర్‌కు వినతిపత్రం ఇచ్చారు. ఈ కేసులో జోక్యం చేసుకోవాలని ఆయన కోరారు. గతంలో కాకినాడ జేఎన్‌టీయూకేలో ఇలాంటి ఘటనలు జరిగినవెంటనే గవర్నర్ జోక్యం చేసుకున్నారని ఆయన గుర్తుచేశారు.

చిత్రం...ఇంటర్ బోర్డు వైఫల్యంపై సీఎస్‌కు వినతిపత్రం అందజేస్తున్న బీజేపీ నేతలు