తెలంగాణ

విద్యా మంత్రిని బర్త్ఫ్ చేయాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షల అవకతవకలపై స్పష్టమైన ప్రకటన చేయని రాష్ట్ర విద్యా మంత్రి జగదీశ్వర్‌రెడ్డిని , ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌కుమార్‌ను తక్షణం బర్త్ఫ్ చేయాలని ఎఐఎస్‌ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు అశోక్ స్టాలిన్ , రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి ఆర్ ఎన్ శంకర్ డిమాండ్ చేశారు. మంగళవారం నాడు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 12లో తెలంగాణ రాష్ట్ర మంత్రుల నివాసాలను ఎఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో ముట్టడించారు. ఈ ముట్టడిలో భాగంగా ఎఐఎస్‌ఎఫ్ నేతలకు , పోలీసులకు మధ్య వాగ్యుద్ధం జరిగింది. ఎఐఎస్‌ఎఫ్ నేతలను బలవంతంగా పోలీసులు లాక్కెళ్లి అరెస్టు చేసి గోషామహల్ పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా అశోక్ స్టాలిన్ , ఆర్‌ఎస్ శంకర్, హైదరాబాద్ కార్యదర్శి గ్యార నరేష్ మాట్లాడుతూ ఇంటర్ బోర్డు అధికారుల స్వార్ధ ప్రయోజనాల కోసం విద్యార్ధుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారిందని అన్నారు. ఈ అక్రమాల కారణంగా రాష్ట్ర వ్యాప్తంగా 17 మంది మరణించారని, బోర్డు అక్రమాలపై నిలదీసిన విద్యార్థి సంఘాలను విద్యార్థులనూ, వారి తల్లిదండ్రులనూ తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తూ పోలీసులు దారుణంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. బంగారు తెలంగాణ అంటే విద్యార్థులపై కక్ష సాధింపు చర్యలేనా అని ప్రశ్నించారు. గత 15 సంవత్సరాలుగా మూల్యాంకనం చేస్తున్న సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్‌ను కాదని కొత్తగా మరో సంస్థకు కాంట్రాక్టు ఏ ప్రాతిపదికపై ఇచ్చారో ప్రభుత్వం బహిరంగంగా చెప్పాలని నిలదీశారు. పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమవుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని, విద్యార్థుల ప్రాణాలు పోతుంటే త్రిసభ్య కమిటీ వేశామని నెట్టుకు వస్తోందని అన్నారు. ప్రభుత్వం మొద్దు నిద్రవీడి విద్యార్ధుల జీవితాలతో ఆడుకోకుండా ఇప్పటికైనా కఠిన కార్యాచరణకు దిగాలని వారు సూచించారు. ప్రభుత్వం సవ్యమైన నిర్ణయాలు తీసుకోకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు.
ఏబీవీపీ ఆధ్యర్యంలో మంత్రుల నివాసాల ముట్టడి
వేలాది మంది విద్యార్థుల భవిష్యత్‌ను ప్రశ్నార్ధంగా మార్చిన ఇంటర్ బోర్డు కార్యదర్శి అశోక్‌ను తక్షణం తొలగించాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ నేతలు మంగళవారం నాడు మంత్రుల నివాసాలను ముట్టడించారు. ఈ కార్యక్రమంలో ఏబీవీపీ నేతలు అంబాల కిరణ్, శ్రీహరి, అయ్యప్ప, ప్రవీణ్‌రెడ్డి, ఎల్లస్వామి, శ్రావణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిత్రం... ఇంటర్ బోర్డు వద్ద ఆందోళన వ్యక్తం చేస్తున్న విద్యార్థులు