తెలంగాణ

ఆత్మహత్యలకు బాధ్యులు ఎవరు?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: ఫలితాల్లో తేడాలు రావడంతో ఇంత వరకూ జరిగిన విద్యార్థుల ఆత్మహత్యలకు ఎవరు బాధ్యత వహిస్తారో ముఖ్యమంత్రీ, ప్రభుత్వం తేల్చి చెప్పాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి మంగళవారం నాడు డిమాండ్ చేశారు. ఇంటర్ ఫలితాల్లో ఇంత వరకూ 16 మందికి పైగా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని, ఇంటర్ బోర్డు తప్పుల బోర్డుగా, అవినీతి బోర్డుగా మారిందని కార్పొరేట్లకు కొమ్ముకాసే పద్ధతుల్లోనే ఇంటర్ బోర్డు వ్యవహరిస్తోందని ఆయన ఆరోపించారు. బాధ్యులను కఠినంగా శిక్షించడమేగాక, చనిపోయిన విద్యార్థుల కుటుంబాలకు 25 లక్షల ఆర్ధిక సాయం, వారి కుటుంబంలో అర్హులైన వారికి ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని సూచించారు. సమస్యను రెండు రోజుల్లో పరిష్కరించకుంటే ఉద్యమం ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. మరో పక్క రైతుల ఘోస కూడా ముఖ్యమంత్రికి వినిపించడం లేదని రాష్ట్రంలో కనీవినీ రీతిలో గాలి వాన వడగండ్లు ముంచెత్తాయని దానిపై ప్రభుత్వం నుండి ఎలాంటి స్పందన లేదని అన్నారు.
ఎన్నో బీరాలు పలికిన కేసీఆర్‌కు రైతన్న ఘోస వినపడటం లేదా అని ప్రశ్నించారు. తక్షణం రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తడిసిన ధాన్యాన్ని గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కోనుగోలు చేయాలని ఆయన కోరారు.