తెలంగాణ

ఇంటర్ బోర్డు వద్ద భద్రత పెంపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 23: ఫలితాలు విడుదలై ఆరు రోజులు గడిచినా ఇంటర్మీడియట్ విద్యార్థులు, వారి తల్లిదండ్రుల ఆగ్రహం తగ్గకపోవడంతో ఇంటర్మీడియట్ బోర్డు వద్ద ఉద్రిక్తత పెరిగింది. వందల్లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు బోర్డు వద్దకు చేరుకుని తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. అయితే వారి ఆవేదన వినేందుకు అధికారులు ఎవరూ వారిని బోర్డు లోపలికి అనుమతించకపోవడంతో వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు వచ్చిన వారిని వచ్చినట్టు ఈడ్చుకుంటూ వెళ్లి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. మరో పక్క ఏబీవీపీ, ఎస్‌ఎఫ్‌ఐ, ఎఐఎస్‌ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు , తెలుగు యవత నేతలు, మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వరరావు తదితరులు వచ్చి వివరాలు తెలుసుకుందామని అడిగే లోపలే పోలీసులు వారిని వ్యాన్‌ల్లో ఎక్కించి వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు. ఒక అమ్మాయి తనకు తక్కువ మార్కులు వచ్చాయని ప్రశ్నించడంతో పోలీసులు ఆమెను మీడియాతో మాట్లాడనీయకుండా బోర్డు వద్ద పోలీసు వ్యాన్‌లో బలవంతంగా తరలించారు. తనను వదిలిపెట్టాలని, వెళ్లిపోతానని ఆమె అరిచినా పోలీసులు కరగలేదు. వదిలిపేట్టేది లేదని పోలీసు స్టేషన్‌కు వెళ్లాల్సిందేనని పేర్కొన్నారు. ఇంటర్ బోర్డు నిర్వాకంతో చెలరేగిన అలజడి మంగళవారం నాడు మరింత తీవ్రరూపం దాల్చింది. ఆందోళన కారులను నిర్ధాక్షిణ్యంగా పోలీసులు నిలువరిస్తున్నారు. తప్పు చేసిన వారిపై కఠిన చర్యలు తప్పవని అధికారులు చెబుతున్నారని, కఠిన చర్యల కంటే ముందే తమకు వచ్చిన మార్కులు చూసి విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని దీనికి ఎవరు బాధ్యత వహిస్తారని తల్లిదండ్రులూ , విద్యార్థులూ నిలదీశారు.
గొంతును నొక్కేస్తారా?
ఇంటర్మీడియట్ ఫలితాల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేసి, విద్యార్థులకు న్యాయం చేయాలని కోరుతూ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కే నాగేశ్వర్, మరికొంత మంది బోర్డు వద్దకు వచ్చి ఆరా తీయగా వారిని పోలీసులు అరెస్టు చేశారు. మాజీ ఎమ్మెల్సీని పిలిచి విషయం తెలుసుకోవల్సిన పోలీసులు, బోర్డు అధికారులు నిర్ధాక్షిణ్యంగా వ్యవహరించడంపై సీపీఎం కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరినీ అరెస్టు చేసుకుంటూ పోవడం చూస్తుంటే ప్రశ్నించే గొంతును నొక్కేయడమేనని అన్నారు. కమిటీ రిపోర్టు పేరుతో ఆలస్యం చేసి విషయాన్ని పక్కకు మళ్లించడం సరికాదని సీపీఎం భావిస్తోందని, ఇప్పటికైనా ప్రభుత్వం విద్యార్థుల ఆందోళనలను గుర్తించి ఇంటర్ ఫలితాల్లో అక్రమాలను సరిదిద్ది బాధ్యులపై చర్యలు తీసుకోవలని అన్నారు.
అక్రమ అరెస్టులు
ఇంటర్ బోర్డు ముందు ఆందోళన చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ విద్యార్ధులను అరెస్టు చేయడం దారుణమని , పొరపాట్లు సరిదిద్దాల్సిన ప్రభుత్వం రాజకీయ కోణంతో చూస్తోందని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి కోట రమేష్ పేర్కొన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా 17 మంది విద్యార్ధులు ఆత్మహత్యకు పాల్పడ్డారని ప్రభుత్వం మాత్రం నిమ్మకునీరెత్తినట్టు వ్యవహరిస్తోందని అన్నారు. ఫలితాల్లో అక్రమాలకు కారకులు ఎవరో ప్రభుత్వానికి తెలుసని , అంతర్గత కలహాల పేరుతో విషయాన్ని పక్కదారి పట్టించేందుకు టీఆర్‌ఎస్ ప్రభుత్వం కుట్ర చేస్తోందని అన్నారు.
రాష్టవ్య్రాప్తంగా ఉద్యమాలను ఉద్ధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఇంటర్ బోర్డు వద్ద పోలీసులు భద్రతను పెంచారు. మూడంచెల భద్రతను ఏర్పాటు చేశారు. రాత్రి పూట కూడా బోర్డు కార్యాలయం వద్ద పహరాను పెంచారు. బోర్డు పరిసరాలకు వచ్చి విషయం ఆరా తీస్తున్న వారిపైనా పోలీసులు జులుం ప్రదర్శిస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి.
చిత్రం...మాజీ ఎమ్మెల్సీ నాగేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్న పోలీసులు