ఆంధ్రప్రదేశ్‌

రోజురోజుకూ తగ్గిపోతున్న సాగర్ నీటిమట్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయపురిసౌత్, జూన్ 19: శ్రీశైలం జలాశయం నుండి సాగర్ ప్రాజెక్టుకు నీటి చేరిక పూర్తిగా నిలిచిపోవడంతో రోజురోజుకు నీటిమట్టం తగ్గిపోతోంది. ఆదివారం సాయంత్రానికి సాగర్ జలాశయం నీటిమట్టం 505 అడుగులకు చేరుకుంది. ఇది 123.33 టీయంసీలకు సమానం. హైదరాబాద్ వాసులకు తాగునీటి అవసరాల నిమిత్తం ఎస్‌ఎల్‌బీసీ ద్వారా 800 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. శ్రీశైలం జలాశయం నీటిమట్టం 777.50 అడుగుల వద్ద కొనసాగుతోంది. ఇది 19.43 టీయంసీలకు సమానం.

నెల్లూరు కార్పొరేషన్‌లో
ఎసిబి దాడులు
రూ.50 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ ఎసిపి
కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి రూ.5,36,200 స్వాధీనం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జూన్ 19: నెల్లూరు నగరపాలక సంస్థ కార్యాలయంలో అవినీతి నిరోధక శాఖ అధికారులు ఆదివారం దాడులు నిర్వహించారు. కార్యాలయం సమీపంలో ఉన్న దర్గా వద్ద అసిస్టెంట్ సిటీ ప్లానర్ మునిరత్నం రూ.50 వేలు లంచం తీసుకుంటూ ఎసిబి అధికారులకు చిక్కారు. వివరాల్లోకి వెళితే.. నెల్లూరులోని బివి నగర్ ప్రాంతానికి చెందిన కంచిబొట్ల శ్రీ్ధర్ ఇంటి ప్లాన్ కోసం ఈ ఏడాది జనవరిలో కార్పొరేషన్‌లో దరఖాస్తు చేసుకున్నాడు. దరఖాస్తు చేసుకున్న ప్రాంతంలో లే అవుట్ అప్రూవల్ లేదంటూ కార్పొరేషన్ సిటీ ప్లాన్ అధికారులు మెలిక పెట్టారు. 14 శాతం బెటర్‌మెంట్ పన్ను కడితే ప్లాన్ ఆమోదిస్తామని చెప్పారు. అధికారుల లెక్కల ప్రకారం రూ.2 లక్షల 94 వేల రూపాయలు కట్టాలనీ, లేదంటే అందులో 50 శాతం లంచంగా ఇస్తే ప్లాన్‌కు ఆమోదముద్ర వేస్తామని తేల్చిచెప్పడంతో బాధితుడు గత మార్చి నెలలో ఏసిబి అధికారులను ఆశ్రయించాడు. అప్పట్నుంచి కార్పొరేషన్ టౌన్ ప్లానింగ్ కార్యకలాపాలపై ఎసిబి అధికారులు నిఘా ఏర్పాటు చేసి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అనంతరం మునిరత్నంను అదుపులోకి తీసుకుని నగరపాలక సంస్థ కార్యాలయంలో సోదాలు నిర్వహించారు.
కాంట్రాక్ట్ ఉద్యోగి నుంచి నగదు స్వాధీనం
లంచం కేసులో ఉద్యోగిని అదుపులోకి తీసుకున్న ఎసిబి అధికారులు కార్పొరేషన్ కార్యాలయంలో సోదాలు సాగించే సమయంలో హఫీజ్ అలియాస్ అలీ అనే కాంట్రాక్ట్ ఉద్యోగి వద్ద నుంచి 5 లక్షల 34 వేల రూపాయలను స్వాధీనం చేసుకున్నారు. బూత్‌లెవల్ విధులు నిర్వహించిన అధికారులకు చెల్లించాల్సిన మొత్తం ఇదని కార్పొరేషన్ అధికారులు చెబుతున్నారు. అయితే అంత మొత్తం ఒక కాంట్రాక్ట్ ఉద్యోగి వద్ద ఎందుకుందనే కోణంలో ఎసిబి అధికారులు విచారణ సాగిస్తున్నారు.