తెలంగాణ

ఓట్ల కోసం ప్రలోభ పెట్టేందుకే రైతుబంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కామారెడ్డి, ఏప్రిల్ 19: రైతుల శ్రేయస్సు కోసమంటూ ఏప్రిల్ 2018లో టీఆర్‌ఎస్ ప్రభుత్వం జీవో తీసుకుని వచ్చి రైతు బంధు పథకం తీసుకుని వచ్చింది, రైతుల శ్రేయస్సు కోసం కాదని, కేవలం రాజకీయ లబ్ధి, ఓటు బ్యాంకు కోసం తెచ్చిన పథకం ఇది అని కిసాన్ జాతీయ కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు, టీపీసీసీ క్రమశిక్షణ కమిటీ చైర్మెన్ కోదండరెడ్డి ఆరోపించారు. శుక్రవారం ఆయన కామారెడ్డి జిల్లాలోని మాచారెడ్డి మండలంలో పర్యటించిన అనంతరం కామారెడ్డి జిల్లా కాంగ్రెస్ కార్యాలయంలో డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు కోదండరెడ్డిని సన్మానించారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రైతు బంధు పథకం రైతుల కోసం తెచ్చిన పథకం కాదని ముందస్తు ఎన్నికల ఈ పథకం తెచ్చి రైతులను బ్రలోభపెట్టారని ఆరోపించారు. మొదటి విడత అందరి ఖాతాలో డబ్బులు వేసి రెండో విడత కొంతమందికి మాత్రమే ఖాతాలో డబ్బులు వేశారని అన్నారు. రైతుబంధు పథకం తీసుకుని వస్తే కాంగ్రెస్ పార్టీ కూడా రైతులకు మేలు జరుగుతుందని తెలంగాణ ప్రభుత్వాన్ని అభినందించామని కానీ టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఆ పథకాన్ని ఓట్ల కోసం వాడుకుని రైతులను మోసం చేసిందన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం మేము భూప్రక్షాళన చేశామని చెప్పుకుంటుందని, కాని నేటి వరకు 22లక్షల మందికి పాస్‌పుస్తకాలు రాలేదని, దీంతో రైతులు అనేక ఇబ్బందులు పడ్తున్నారని అన్నారు. ఇప్పుడు ప్రజల దృష్టిని మళ్లించడానికి కేసీఆర్ సర్కార్ రెవిన్యూ వ్యవస్థను రద్దు చేస్తామని ఏకపక్షంగా పత్రిక ప్రకటన చేసిందన్నారు. ఏదైనా సంస్కరణలు చేపడితే ప్రతిపక్షాలు మేధావులను, రైతులను సలహాలు సంప్రదింపులు చేస్తారని కాని కాని తెలంగాణలో టీఆర్‌ఎస్ సర్కార్ వన్‌మెన్ షో చేస్తుందని ఆరోపించారు. కేసీఆర్ ఒక నియంతల ప్రవర్తిస్తూ.. జీవోలు తీసుకొస్తూ.. అటు అధికారులను ఇటు రైతులను ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ హయాంలో ఇందిరాగాంధీ హయాంలో ఇందిరా గాంధీ ప్రభుత్వంలో బ్యాంకులన్నింటినీ జాతీయం చేసి ఈ ప్రజలకు మేలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. దీనివల్ల బడుగు, బలహీన వర్గాలకు మేలు జరిగిందన్నారు. ఇప్పుడు బీజేపీ కేంద్రంలో అధికారంలో వచ్చిన తరువాత ప్రధాని మోదీ నాయకత్వంలో బ్యాంకింగ్ వ్యవస్థను నాశనం చేశారని రైతులకు, బడుకు బలహీన వర్గాలకు నష్టం జరిగేలా చేశారని ఆరోపించారు. ఇప్పుడు బ్యాంకింగ్ వ్యవస్థను పెట్టుబడిదారులకు దేశాన్ని తాకట్టుపెట్టిందని ఆరోపించారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలోనే భూభారతి అనే పైలట్ ప్రాజెక్ట్‌ను నిజామాబాద్ జిల్లాలో అమలు చేసి భూప్రక్షాళన కార్యక్రమం చేపట్టిందని ఇందులో మంచి ఫలితాలు వచ్చాయని అన్నారు. ఆ తర్వాత వచ్చిన తెలంగాణ ఉద్యమంలో మరియు రాష్ట్రంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం రావడంతో ఆ ప్రాజెక్ట్ రద్దు అయిందన్నారు. అప్పుడు యూపీఏ సర్కార్ జాతీయ స్థాయిలో 3,600 కోట్లు ప్రకటించి భూప్రక్షాళన భూసర్వే కార్యక్రమం చేపటిందన్నారు. ఇందులోంచి 178 కోట్లు తీసుకున్న కేసీఆర్ ఇప్పటి వరకు భూసర్వే కార్యక్రమం చేయలేదని అన్నారు. భూప్రక్షాళన చేసి వారసత్వ భూములకు రైతులకు పాస్‌పుస్తకాలు రాక, సబ్సిడిరుణాలు అందక రైతలు సతమతమవుతున్నారని అన్నారు. ఒక భూపాలపల్లి జిల్లాలో 60శాతం మంది రైతులకు మాత్రం పాస్‌పుస్తకాలు వచ్చాయని, మిగత 40శాతం మంది రైతులకు రైతు బంధు పథకం అమలు కాలేదని అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఏ జిల్లాకు వెళ్లినా లక్షల సంఖ్యలో రైతుల నుండి నివేదనలు అందుతున్నాయని, వీటిలో రైతుబంధు రాలేదని, పాస్‌పుస్తకాలు రాలేదని అంటున్నారని అన్నారు. అంతకు ముందు తాము ఉన్న పాస్‌పుస్తకాలతో బ్యాంకులకు వెళ్లి రుణాలు తెచ్చుకునే వారమని, ఇప్పుడు తమకు వ్యవసాయ భారంగా మారుతోందని రైతులే అంటున్నారని ఆయన అన్నారు. రైతులను చూస్తే బాధ వేస్తోందని అన్నారు. రైతుల కోసం తాము పోరాడి రైతులకు అండగా నిలుస్తామని, అవసరమైతే ప్రభుత్వాన్ని నిలదీసి, ఉద్యమాలు సైతం చేస్తామని అన్నారు. ఈ విలేఖరుల సమావేశంలో కిసాన్ కాంగ్రెస్ చైర్మన్ అనే్వష్‌రెడ్డి, డీసీసీ అధ్యక్షుడు కైలాస్ శ్రీనివాస్‌రావు, కాంగ్రెస్ నాయకులు పంపరి శ్రీనివాస్ , గోనే శ్రీనివాస్, పంతులు శ్రీనివాస్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.