తెలంగాణ

రాజకీయ నిరుద్యోగులకు బంపర్ ఆఫర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 19: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల వల్ల స్థానిక సంస్థలు బాగుపడే సంగతి పక్కనపెట్టండి. ముందుగా రాజకీయ నిరుద్యోగులకు మాత్రం ఇది ఒక భారీ రిక్రూట్‌మెంట్. ఐదేళ్లకోసారి వచ్చే ఈ రిక్రూట్‌మెంట్‌లో నానా తంటాలు పడి ఎన్నికైతే చాలు. జీవితంలో సెటిలైపోవచ్చు. ఇంతకీ ఈ పదవులకు ఉన్న ప్రత్యేకత చూస్తే ఆశ్చర్యపోతారు. జడ్పీ చైర్మన్ నెల జీతం అక్షరాలా లక్ష రూపాయలు. నాలుగేళ్ల క్రితం ఈ జీతం నెలకు రూ. 7500 మాత్రమే చెల్లించేవారు. పేరుకు క్యాబినెట్ ర్యాంకు. కాని జీతం అంతంత మాత్రమే. తెలంగాణ రాష్ట్రం అవతరించిన తర్వాత కేసీఆర్ జీతాలు పెంచుతూ చేసిన ప్రకటన ఎంపీటీసీ, జడ్పీటీసీలకు వరంలా మారింది.
రాష్ట్రంలో మే నెలలో 539 మండల ప్రజా పరిషత్ అధ్యక్ష పదవులకు, 539 జడ్పీటీసీ సభ్యుల పదవులు, 5857 ఎంపీటీసీ పదవులు ఉన్నాయి. ఒక్కో ఎంపీటీసీకి నెలకు రూ.5వేల వేతనం చెల్లిస్తారు. గతంలో రూ.750 గౌరవ వేతనం ఇచ్చేవారు. జడ్పీటీసీ సభ్యులకు నెలకు రూ.10వేల గౌరవం వేతనం ఇస్తారు. గతంలో రూ.2250 వేతనం లభించేది. మండల ప్రజాపరిషత్ అధ్యక్షుడికి నెలకు రూ.10వేల గౌరవ వేతనం చెల్లిస్తారు. గతంలో రూ. 1500 వేతనం చెల్లించేవారు. గౌరవంగా, సేవా భావంతో పనిచేసే వారికి నిజంగా ఈ వేతనం చాలకపోయినా, ప్రజాప్రతినిధులుగా రాణించేందుకు ఈ పదవులు ఉపయోగపడుతాయి. కాని లోతుగా విశే్లషిస్తే ఎంపీటీసీ, జడ్పీటీసీ సభ్యులు అంతటితో ఆగరు. వీరిలో అందరూ కాకపోయినా, కొంతమం ది అనేక వ్యవహారాల్లో తలదూర్చి అందినంత దండుకునే వారుంటారు.
వీరే భవిష్యత్తులో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సమాయత్తమవుతుంటారు. సమాజంలో హోదా, గౌరవం ఉండడంతో తెలంగాణ రాష్టవ్య్రాప్తంగా రాజకీయ నిరుద్యోగుల్లో క్రేజ్ మొదలైంది. తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు అన్ని వర్గాల్లో యువకులు సమాయత్తమవుతున్నారు. జడ్పీ చైర్మన్లకు అధికారాలు ఇవ్వాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉండడంతో, 32 జడ్పీ చైర్మన్ల పోస్టులకు కూడా అన్ని పార్టీల నుంచి పెద్ద సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జడ్పీటీసీ సభ్యులుగా ఎంపికైన వారే జడ్పీ చైర్మన్లుగా ఎన్నికయ్యేందుకు అర్హులు. జడ్పీపీ చైర్మన్ అంటే ఒక సామంతరాజ్యానికి రాజు లాంటి వారని చెప్పవచ్చు. అలాంటి పదవులకు నోటిఫికేషన్ విడుదలైన తర్వాత పెద్ద సంఖ్యలో అన్ని వర్గాలకు చెందిన యువతీ యువకులు పరిషత్ ఎన్నికలకు పోటీ చేసేందుకు సిద్ధమవుతుండటం విశేషం.